ELEVENTH EPISODE BALAKANDA AKHANDA PARAYANAM ON AUGUST 25 _ ఆగస్టు 25న 11వ విడత బాలకాండ అఖండ పారాయణం
TIRUMALA, 23 AUGUST 2022: The Eleventh episode of Akhanda Balakanda Parayanam will be observed by TTD at Nada Neerajanam platform in Tirumala on August 25 between 7am and 9am.
A total of 153 Shlokas from Chapters 50-55 of Balakanda will be recited by Vedic pundits and Sanskrit scholars along with the devotees which will be relayed live on SVBC for the sake of global devotees.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 25న 11వ విడత బాలకాండ అఖండ పారాయణం
తిరుమల, 2022 ఆగస్టు 23: లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆగస్టు 25వ తేదీన గురువారం 11వ విడత బాలకాండ అఖండ పారాయణం జరుగనుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
బాలకాండలోని 50 నుండి 55 సర్గల వరకు గల 153 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.