TRAINING ON DESI COWS PROTECTION IN SVETA ON AUGUST 25 AND 26 _ ఆగ‌స్టు 25, 26వ తేదీల్లో శ్వేత‌లో నోడ‌ల్ గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

TIRUPATI, 23 AUGUST 2022:  To organize Gosalas, execute cow-based agriculture (Go Adharita Vyavasayam), Desi Cows protection TTD is conducting a two-day training programme to interested and young Gosala Organizers and farmers on August 25 and 26 at SVETA in Tirupati.

On first day, training will be given to the organizers of 200 Gosalas belonging to Tirupati and Chittoor districts on the benefits of Natural Farming techniques. On second day, training will be imparted to 40 Nodal Gosala Organizers of Andhra Pradesh.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 25, 26వ తేదీల్లో శ్వేత‌లో నోడ‌ల్ గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

తిరుపతి, 2022 ఆగస్టు 23: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై నోడల్ గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఆగ‌స్టు 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైనవారు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

మొద‌టిరోజు తిరుప‌తి, చిత్తూరు జిల్లాల‌కు చెందిన 200 మంది గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు శిక్ష‌ణ ఇస్తారు. రెండోరోజు ఆంధ్రప్ర‌దేశ్‌లోని 40 మంది జిల్లా నోడ‌ల్ గోశాల నిర్వాహ‌కుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.