ENDOWMENTS COMMISSIONER TAKES OATH AS TTD EX-OFFICIO _ టీటీడీ బోర్డు ఎక్స్-అఫీషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం

TIRUMALA, 15 APRIL 2023: The Commissioner of AP Endowments, Sri Satyanarayana took oath as Ex-officio member of TTD Trust Board in Tirumala temple on Saturday.

The oath of office was administered by TTD JEO Sri Veerabrahmam in front of Sri Venkateswara Swamy at Bangaru Vakili.

After darshan along with his family, the TTD Ex-officio member was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam followed by offering of Srivari laminated photo, Theertha Prasadams.

Temple DyEO Sri Ramesh Babu, Deputy Board Cell Smt Kasturi Bai, Temple Peishkar Sri Srihari and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టీటీడీ బోర్డు ఎక్స్-అఫీషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం

తిరుమల, 15 ఏప్రిల్ 2023: టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ సత్యనారాయణకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను జెఈవో అందించారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఆలయ పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.