ENDOWMENTS MINISTER TAKES PART IN SUNDARAKANDA PARAYANAM _ స్వామిదయతో అంతా మంచే జరుగుతుంది : దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్

Tirumala, 21 Aug. 20: The Honourable Minister of AP Endowments Sri Vellampalli Srinivas participated in Sundarakanda Parayanam on Friday.

Later the minister had darshan of Lord Venkateswara along with his family. Speaking on the occasion he said, TTD is successfully carrying out darshan to pilgrims by strictly observing Covid guidelines. 

He also complimented TTD for launching programmes like Sundarakanda and Virata Parvam which is been lauded by crores of devotees across the world.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వామిదయతో అంతా మంచే జరుగుతుంది : దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్

తిరుమల 21 ఆగస్టు 2020: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల కరోనా నుంచి ప్రజలు త్వరలోనే విముక్తి చెందుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.శుక్రవారం ఉదయం ఆయన స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం నాదనీరాజన వేదిక మీద నిర్వహిస్తున్న సుందర కాండ పారాయణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆలయం ఎదుట తనను కలిసిన మీడియాప్రతినిధులతో మాట్లాడారు. టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడానికి టీటీడీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు టీటీడీ కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు అమలు చేస్తూ సంతృప్తికర దర్శనం కల్పిస్తోందని చెప్పారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యమనే ఉద్దేశం తో ప్రభుత్వం వినాయక చవితి పండుగను ప్రజలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించిందని చెప్పారు. ఆలయాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో కార్యక్రమాలు చేయాలని ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఇందులో ప్రభుత్వానికి ఇతర ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది