ENSURE MORE FACILITIES TO PILGRIMS IN VQC-TIRUMALA JEO _ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

Tirumala, 27 June 2017: The pilgrims should get all the required amenities while waiting in compartments including food, water, medical facility on emergency etc. without fail, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The weekly review meeting was held in Annamaiah Bhavan at Tirumala on Tuesday. Directing the officials concerned he said, during rush hours more care should be ensured and pilgrims should be given all sort of annaprasadams as per schedule. “When any pilgrim calls the concerned department you should immediately respond to them and solve the problem without any delay. The srivari sevakulu are gathering the feedback reports every day and all the departments should react to their respective queries”, he maintained.

He also instructed the electrical wing to display the exact time of darshan in all the display boards placed in all compartments for the information of the pilgrims. “Also erect information boards to guide pilgrims in a proper way about the vital places in Tirumala”, he told the engineering wing.

SE II Sri Ramachandra Reddy, Temple DyEO Sri Kodanda Rama Rao and other officers took part in this meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017, జూన్‌ 27: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని కంపార్ట్‌మెంట్లలో వెంటనే పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారులతో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వారాంతంలో భక్తుల రద్దీకి తగ్గట్టు తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు విభాగాల వారీగా పలు సూచనలు చేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్సు -1, 2లలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో తక్షణమే ఫోన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. భక్తులు ఫోన్‌ చేసినపుడు అన్నప్రసాదం, వైద్యం, ఆరోగ్య, విద్యుత్‌, వాటర్‌వర్క్స్‌, జలప్రసాదం తదితర విభాగాల అధికారులు వెంటనే స్పందించాలన్నారు.

శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయ సేకరణ జరుగుతోందని, ఇందుల్లో వెల్లడయ్యే సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జెఈవో సూచించారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద తగినంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచి భక్తులకు సరైన సూచనలు, సలహాలు అందించాలన్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాల సమాచారాన్ని అందించేందుకు డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, శ్రీమతి విమలకుమారి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ రాజేంద్ర, శ్రీబాలాజి, శ్రీహరీంద్రనాథ్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి, రిసెప్షన్‌ ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.