ENSURING HASSLE-FREE DARSHAN TO PILGRIMS IS OUR PLEDGE-Addnl. EO _ భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మా ధ్యేయం : గణతంత్ర వేడుకల్లో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 26 Jan. 20: Ensuring hassle free darshan and other amenities to pilgrims by weeding out corruption, black marketeers and middle men is our pledge, advocated TTD Additional EO Sri AV Dharma Reddy.

During his R-Day address on the occasion of 71st Republic Day Celebrations in Gokulam Rest House Ground on Sunday, the Additional EO called upon the entire work force of TTD working in Tirumala, to dedicate themselves in the pilgrim service. “Pilgrims come for darshan of Sri Venkateswara Swamy and for all of us the pilgrims are almighty.

“During last Independence Day, we took a pledge to weed out middlemen and dalaris and we succeeded doing so in Darshan and Laddu prasadam by bringing out reforms with the introduction of SRIVANI Trust linking with darshan and making sale of laddus in open. Still there is need to bring some changes in reception wing and ensure that the rooms are available to common pilgrims without any inconvenience.  So all of us should take a pledge to bring more reforms by this Independence Day”, he added.

He also thanked all the wings working in Tirumala including Engineering, Annaprasadam, Health and Vigilance for for extending timely co-operation with team work and making annual brahmotsavams and Vaikuntha Ekadasi a grand success. “I anticipate the same from you all in future also in all our endeavours to enhance the name and fame of our Institution globally”,  he maintained.

CE Sri Ramachandra Reddy, SE 2 Sri Nageswara Rao, Estates Officer Sri Vijaya Saradhi, DyEOs Sri Nagaraju, Sri Selvam, Sri Balaji,  Sri Damodaram, Health Officer Dr RR Reddy, VGO Sri Manohar and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మా ధ్యేయం : గణతంత్ర వేడుకల్లో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 జనవరి 26: భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు ద‌ళారుల‌ను అరిక‌ట్టి, అవినీతిని నిర్ములించ‌డ‌మే లక్ష్యంగా ముందుకు వెళుతున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ  ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉద‌యం 71వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అద‌న‌పు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచం న‌లుమూలల‌ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు టిటిడి ఉద్యోగులు అంకితభావంతో మ‌రింత మెరుగైన సేవ‌లందించాల‌ని పిలుపునిచ్చారు. గ‌త స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ద‌ర్శ‌నంతో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా క‌ల్పిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశామ‌న్నారు. అందులో భాగంగా య‌స్‌.సి., య‌స్‌.టి., బి.సి.ప్రాంతాల‌లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలు అందించే దాత‌ల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాన్ని కేటాయించ‌డం ద్వారా ద‌ర్శ‌న ద‌ళారుల‌ను నిర్మూలించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారిని ద‌ర్శించుకున్న ప్ర‌తి భ‌క్తుడికీ ఉచితంగా 175 గ్రాముల ల‌డ్డూ అందిస్తున్నామ‌న్నారు. అద‌న‌పు ల‌డ్డూ ప్ర‌సాదాలు కావ‌ల‌సిన వారికి అందుబాటులో ఉంచ‌డం ద్వారా దాదాపు ల‌డ్డూ ద‌ళారుల‌ను అరిక‌ట్టిన‌ట్లు వివ‌రించారు. తిరుమ‌ల‌కు విచ్చేసే సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవ‌స‌ర‌మైన వ‌స‌తి క‌ల్పించేందుకు మార్పులు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. వ‌స‌తి విభాగంలో మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా గ‌దుల ద‌ళారుల‌ను నిర్మూలించ‌నున్న‌ట్లు వివ‌రించారు. రాబోవు స్వాతంత్య్ర‌ దినోత్స‌వం నాటికి మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని మ‌న‌మంద‌రం ప్ర‌తిజ్ఞ చేయాల‌న్నారు.

తిరుమలలో ఇంజనీరింగ్, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం, విజిలెన్స్  మ‌రియు అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాలు,  వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసినందుకు ఆయన అభినంధించారు. ఇదేవిధ‌మైన స్ఫూర్తితో భవిష్యత్తులో భ‌క్తుల‌కు నాణ్య‌మైన సేవ‌లు అందించేందుకు టిటిడి అధికారులు, ఉద్యోగులు, భ‌ద్ర‌తా సిబ్బంది స‌హ‌కారం ఆశిస్తున్నామ‌న్నారు.  

ఈ కార్య‌క్ర‌మంలో సిఇ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ 2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్‌ ఆఫీసర్ శ్రీ విజయ సారధి, డెప్యూటీ ఈవోలు శ్రీ నాగరాజు, శ్రీ సెల్వం, శ్రీ బాలాజీ, శ్రీ దామోదరం, ఆరోగ్య శాఖ అధికారి డా.. ఆర్.ఆర్.రెడ్డి, విజివో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.