ENVIRONS OF TIRUMALA ARE CLEAN AND TIDY-SINGAPORE MINISTER_ తిరుమలలో పరిశుభ్రత, పర్యావరణం భేష్‌ : సింగపూర్‌ మంత్రి గౌ|| శ్రీ ఎస్‌.ఈశ్వరన్‌

Tirumala, 1 July 2018: The Honourable Minster for Communication and Information of the Republic of Singapore, Sri S Iswaran complimented TTD administration for the maintenance of clean environs in Tirumala.

The foreign minister paved a visit to Tirumala shine and had darshan of Lord Venkateswara Swamy twice during Suprabhata Seva and VIP break along with his family.

After darshan, he was rendered Vedasirvachanam in Ranganayakula Mandapam by vedic pundits. TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju presented him Teertha Prasadams of Lord.

Earlier, the EO also briefed the foreign dignitary about the significance of the Retractable roof.

AP Minister Sri Narayana, Temple DyEO Sri Haridranath, Reception Officials Sri Balaji, Sri Lokanadham and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో పరిశుభ్రత, పర్యావరణం భేష్‌ : సింగపూర్‌ మంత్రి గౌ|| శ్రీ ఎస్‌.ఈశ్వరన్‌

తిరుమల, 2018 జూలై 01: తిరుమలలో పరిశుభ్రత, పర్యావరణం చక్కగా ఉన్నాయని సింగపూర్‌ కమ్యూనికేషన్స్‌ మరియు సమాచార శాఖ మంత్రి గౌ|| శ్రీ ఎస్‌.ఈశ్వరన్‌ టిటిడిని కొనియాడారు. గౌ|| మంత్రివర్యులు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు. ఆ తరువాత విఐపి బ్రేక్‌ సమయంలోనూ స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు. అంతకుముందు ఆలయంలోని కదిలే పైకప్పు గురించి గౌ|| మంత్రివర్యులకు ఈవో వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ నారాయణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, ఓఎస్‌డి శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.