SPREAD DEVOTEE AWARNESS ON ADDITIONAL LADDUS- TTD EO_ అదనపు లడ్డూలపై భక్తులకు అవగాహన కల్పించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 18 Mar. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal directed the officials to spread awareness about the availability of additional Laddus among devotees who throng Tirumala shrine.

During the senior officers review meeting in the Conference Hall in TTD administrative building on Monday in Tirupati Sri Singhal said special counters were set up within the laddu counter complex and the devotees should be informed about this by erecting flex boards.

He also instructed the engineering officials to put up more colourful arches with spiritual connotations at the main thoroughfares of Tirumala.

As the summer vacation is approaching, he asked the officials to coordinate with the Corporation officials to ensure non stop water supply to Tirumala during summer.

The EO also wanted the officials to complete the task of planting green saplings on the outer ring road by April 15 and the laying of underground cables in Mada Streets by end of May.

The EO also suggested that that display boards are put up at significant locations of Tirupati to appraise TTD news to locals etc. He also wanted the streamlining of Saptagiri magazine subscription so that more devotees are benefitted.

He also directed that the supervisory staff and the senior TTD officials should periodically inspect the Padi Kavali and Thiruvabharanam registers in the TTD local temples.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO B Lakshmi Kantam CVSO Sri Gopinath Jatti, FACAO Sri O Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, DyEO Smt Gautami and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అదనపు లడ్డూలపై భక్తులకు అవగాహన కల్పించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

మార్చి 18, తిరుపతి, 2019: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అదనపు లడ్డూల సౌకర్యాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లలో ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశామని, ఈ విషయాన్ని భక్తులందరికీ తెలిపేలా తిరుమలలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలన్నారు. తిరుమలలోని ముఖద్వారాల్లో మరింత ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శోభాయమానంగా ఆర్చిలు తయారుచేయాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తిరుపతి కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులు బయటినుండి చూడగానే శ్రీవారి పుష్కరిణిలో నీరు కనిపించేలా గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల రింగ్‌ రోడ్డులో తలపెట్టిన మొక్కల పెంపకాన్ని ఏప్రిల్‌ 15వ తేదీనాటికి, ఆలయ మాడ వీధుల్లో భూగర్భ కేబుళ్లను మే నెల నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

తిరుపతిలో ముఖ్యమైన ప్రాంతాల్లో టిటిడి సమాచారాన్ని భక్తులకు తెలియజేసేలా డిజిటల్‌ బోర్డులు ఏర్పాటుచేయాలని ఈవో సూచించారు. సప్తగిరి మాసపత్రిక పాఠకులకు సక్రమంగా అందేలా, మరింత మందికి చేరువయ్యేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలన్నారు. స్థానికాలయాల్లో తిరువాభరణం, పడికావలి తదితర రిజిస్టర్లను ఆలయ పర్యవేక్షణ అధికారులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.