JEO INSPECTS VAIKUNTHAM_ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిస్‌ప్లే బోర్డుల‌ను ప‌రిశీలించిన జెఈవో

Tirumala, 18 Mar. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Monday inspected the Vaikuntham Queue Complex 1 to monitor the functioning of display boards in compartments.

Later he instructed the DE electrical Smt Saraswathi to en sure there is no repetition of information to pilgrims on display board. He also directe the AEO Vaikuntham Sri Anand Babu to update the information on LED boards by properly feeling the information about pilgrims from time to time.

The JEO directed SE Electrical Sri Venkateswaralu, Temple DyEO Sri Harindranath, AVSO Vaikuntham Sri Gangaraju to submit a report in next three days on the amendments made after verifying the information display es on LED board which are placed in each compartment, he maintained.

VGO Security Sri Manohar, SO Anna prasadam Sri Venugopal, Catering officer Sri Sastry, Deputy EE Radio and Broadcast Sri Bhaskar and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిస్‌ప్లే బోర్డుల‌ను ప‌రిశీలించిన జెఈవో

తిరుమల, 2019 మార్చి 18: తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో గ‌ల‌ డిస్‌ప్లే బోర్డుల‌ను సోమ‌వారం టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను డిస్‌ప్లే బోర్డుల్లో పొందుప‌ర‌చాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం పున‌రావృతం కాకుండా చూడాల‌ని ఎల‌క్ట్రిక‌ల్స్‌ డిఇ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌త‌మ్మ‌కు సూచించారు. కంపార్ట్‌మెంట్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారాన్ని అందించాల‌ని ఏఈవో శ్రీ ఆనంద్‌బాబును ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్ఇ(ఎలక్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఎవిఎస్‌వో శ్రీ గంగ‌రాజుతో కూడిన క‌మిటీ అన్ని కంపార్ట్‌మెంట్ల‌ను ప‌రిశీలించి చేప‌ట్టాల్సిన మార్పుల‌పై మూడు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ ఆఫీస‌ర్ శ్రీ శాస్త్రి, డెప్య‌టీ ఇఇ శ్రీ భాస్క‌ర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.