ALL ENGINEERING WORKS SHOULD COMPLETE ON TIME-EO_ ఇంజినీరింగ్‌ పనులను నిర్ణీత వ్యవధిలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 23 October 2017: All the pending Engineering Works should complete on time with a specific action plan, directed TTD EO Sri Anil Kumar Singhal.

A review meeting was held by the EO along with JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna in the Conference Hall in TTD administrative Building in Tirupati with all the Senior Officers of TTD on Monday.

Reviewing various developmental aspects, the EO said, the signages in different languages should be erected at various important places in Tirumala for the information of the public. “The non-functioning phones, fans should be replaced with new ones in VQC without delay. Similarly the toilets in VQC should be cleaned at regular intervals”, he instructed the concerned.

To keep the premises of Tirumala more hygienic and clean, he directed the officials concerned to take expert opinions and prepare an action plan accordingly. There should not be delay in laddu distribution counters.

Later reviewing the arrangements for the upcoming Tiruchanoor Brahmotsavams, the EO said, necessary audio equipment and mike system should be arranged for the big fete. He also reviewed on e-filing system.

FACAO Sri Balaji, CE Sri Chandra Sekhar Reddy and other senior officers also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ఇంజినీరింగ్‌ పనులను నిర్ణీత వ్యవధిలోపు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2017 అక్టోబరు 23: టిటిడిలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను నిర్ణీత వ్యవధిలోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో భక్తిభావాన్ని మరింత పెంచేలా విద్యుత్‌ అలంకరణలు చేపట్టేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. తిరుమలలోని పలు ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేందుకు వీలుగా వివిధ భాషల్లో సూచికబోర్డులను త్వరితగతిన ఏర్పాటుచేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఫోన్లు పనిచేయని పక్షంలో వెంటనే మార్పు చేయాలని, మరమ్మతులకు గురైన ఫ్యాన్లను మార్చాలని ఆదేశించారు. కంపార్ట్‌మెంట్లలో వర్షపునీటి లీకేజిని అరికట్టాలన్నారు. చెక్‌లిస్ట్‌ ప్రకారం కంపార్ట్‌మెంట్లలోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకునేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

తిరుమలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుగా దేశంలోని నిష్ణాతుల నుంచి సలహాలు తీసుకుని నివేదిక రూపొందించాలని ఈవో ఆదేశించారు. భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సేపు వేచి ఉండకుండా కౌంటర్ల వద్ద చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయం, పోటు, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లో విద్యుత్‌, మెకానికల్‌ వైర్లు బయటకు కనిపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ-ఫైలింగ్‌ను దశలవారీగా అన్ని విభాగాలకు విస్తరించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఈ-ఫైలింగ్‌ పురోగతిపై సమీక్షించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల్లో ప్రదర్శించే కళాబృందాలకు అవసరమైన ఆడియో సామగ్రిని సమకూర్చాలని ఈవో సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.