FOOL PROOF SECURITY MEASURES FOR PEDESTRIAN PILGRIMS-EO_ కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 4 November 2017: Fool proof security should be initiated for the sake of pedestrian pilgrims, instructed TTD EO Sri Anil Kumar Singhal to officials concerned.
In the review meeting held at Administrative building in Tirupati with HoDs of all departments along with JEOs Sri KS Sreenivasa Raju and P Bhaskar on Saturday, the EO said, the engineering wing should make necessary arrangements for the same by widening the road at Sri Lakahmi Narasimha Swamy temple to Mokalimettu at Alipiri footpath route or some other alternative measure.
He also said necessary steps should be initiated to avoid slippery on footsteps in Srivarimettu route. “Arrange special lights to the srinivasa kalyanam display boards located in the Vimana Prakaram of Tirumala temple. Also arrange retractable roof from Kalyana Mandapam to Vendi vakili. Use modern hot water pipes to clean the slippery floor near Prasadam area”, he added.
The EO also instructed the CVSO Sri A Ravikrishna to analyse the queue system inside Vaikuntham Queue Complex and ensure that the pilgrims move in lines without jostling.
He later instructed Chief Engineer Sri Chandra Sekhar Reddy to identify frequently rock falling areas in both ghats and take necessary measures to ensure pilgrim safety.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
కాలినడక భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
నవంబరు 04, తిరుపతి, 2017: అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాలిబాట మార్గంలో మెట్లపై భక్తులు జారిపడకుండా తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఫిబ్రవరి నాటికి తిరుమలలో పూర్తిగా ఎల్‌ఇడి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వెండి వాకిలి ప్రాకారంలోని శ్రీనివాసకల్యాణం చిత్రాలకు ప్రత్యేక లైట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు రిట్రాక్టబుల్ రూఫ్ ఏర్పాటుచేసి భక్తులకు వర్షానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. భక్తులు ప్రసాదాలు స్వీకరించే
ప్రాంతంలోని నీటికొళాయిల వద్ద పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచడంతోపాటు వేడినీటితో శుభ్రం చేసే ఆధునిక యంత్రాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో క్యూలైన్లను అధ్యయనం చేసి భక్తులు సౌకర్యవంతంగా దర్శనానికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సివిఎస్‌వోకు ఈవో సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఇతర విభాగాల్లో జనవరి నాటికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తిరుమలకు వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరకామణి విభాగంలో లెక్కింపు మినహా మిగతా పనులను పొరుగుసేవ (పనిని ఔట్‌సోర్స్) ద్వారా చేయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.