LAKSHA BILWARCHANA IN SRI KT ON NOV 8_ నవంబరు 8వ తేదీన శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన
Tirupati, 4 November 2017: The temple of Lord Shiva in Kapilateertham is gearing up to observe Laksha Bilwarchana on November 8.
As per this fete, the deity of Lord Sri Kapileswara is rendered archana with one lakh Bel leaves, which are considered to be auspicious to Lord on that day.
This will be observed from 6am till 12noon and the devotees will be allowed for sarva darshan during this period and also from 12:30pm to 3pm and 5pm till 9pm.
Later in the evening there will be procession of Sri Kapileswara Swamy and Kamakchi Ammavaru in the streets of the temple between 6pm and 8pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 8వ తేదీన శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన
తిరుపతి, 2017, నవంబరు 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులోభాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుంచి 12.00 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 6.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 3.00 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది