EO AND ADDNL.EO INSPECTS MADA STREETS _ తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
Tirumala, 31 January 2020: TTD EO Sri Anil Kumar Singhal along with Additional EO Sri Anil Kumar Singhal on Friday inspected the arrangements made in four mada streets in connection with annual Radha Sapthami festival.
Later speaking to media persons, the EO said, all the galleries are provided with German Sheds to shield the devotees from scorching temperatures during the day. He said, continuous Annaprasadam, water and buttermilk distribution has been ensured in the galleries for the devotees. “We have set up 64 food counters, 1.75lakh half litre water bottles and two lakh buttermilk sachets for the devotees. Nearly 3500 srivari sevakulu, 300 scouts, 300 NCC apart from 300 Security guards of TTD, 1000 police and 14 swimmers have also been roped in take care of the pilgrim safety and security measures”, he added.
The EO said, the Vahana Sevas commences with Suryaprabha Vahanam at 5.30am and concludes with Chandraprabha Vahanam by 9pm on Saturday.
CE Sri Ramachandra Reddy, SE II Sri Nageswara Rao, Annaprasadam DyEO Sri Nagaraja, Catering Officer Sri GLN Shastry, Health Officer Dr RR Reddy, VGO Sri Manohar and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల, 2020 జనవరి 31: భూలోక వైకుంఠమైన తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రథసప్తమిని పురస్కరించుకుని భక్తులకు టిటిడి చేసిన ఏర్పాట్లను టిటిడి ఈవో, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం ఆలయ నాలుగు మాడ వీధులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా రూ.1.6 కోట్లతో మాడ వీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. గ్యాలరీలలోని భక్తులకు 3500 మంది శ్రీవారి సేవకులు, 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో ఉదయం అల్పాహారం, పాలు, అన్నప్రసాదాలు, 1.75 లక్షల త్రాగునీరు బాటిళ్ళు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా టిటిడి విజిలెన్స్, పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా 25 ఎల్ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేశామన్నారు. గ్యాలరీలలో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు 1000 మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.
అదే విధంగా భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్, డాక్టర్లు, అదనపు పారామెడికల్ సిబ్బంది ఎప్పటకప్పుడు అందుబాటులో వుంటారన్నారు. భక్తులను ఆకట్టుకొనే విధంగా విద్యుత్తు దీపాలంకరణలతో కూడిన కటౌట్లు, విశేషంగా పుష్పాలంకరణలు చేసినట్లు తెలిపారు.
రథసప్తమికి తిరుమలకు విచ్చేసే భక్తులకు వాహనసేవలతో పాటు, మూలమూర్తిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఆర్జితసేవలు, ప్రత్యేకదర్శనాలు రద్దు చేశామని, ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే విఐపి దర్శనం కల్పిస్తామని, ఎక్కువ సమయాన్ని సాధారణ భక్తులకు కేటాయిస్తామని చెప్పారు.అదేవిధంగా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, సి.ఇ. రామచంద్రారెడ్డి, ఎస్.ఇ2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ (ఎలక్టికల్) శ్రీ వెంకటేశ్వరరావు, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగరాజ, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, శ్రీ విజివో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్,రెడ్డి. ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.