EO ANNOUNCES MERIT LIST FOR TTD JOBS _ తితిదే వ్రాత పరీక్షల ఫలితాల విడుదల
Tirupati: October 1, 2010: Tirumala Tirupati Devasthanams Executive officer Sri I Y R Krishna Rao has today released the merit list for the recently conducted written tests for recruitment of Junior Assistants, Typists, Stenos and Shroffs in the 186 vacancies in the temple administration.
Sri Rao said in a statement that out of 186 selected candidates, 99 were selected for the Junior Assistant posts, 37 for typist, 26 for shroff, nine for LD Steno and 15 candidates selected for UD Steno, the EO said.
He said the seniority of candidates who secured the same marks will be decided on the basis of their date of birth and also that the rule of the reservation will also be observed in the selection of the candidates.
The candidates as per the merit list displayed in the TTDs website are requested to call on the TTD officials with all necessary supporting documents from October 5th onwards.
The Executive Officer said the candidates selected for each of the posts should appear before the concerned officials at the TTD Admin buildings along with their documents and certificates on the below-mentioned dates.
- Candidates posts of Typists and LD Stenos on October 5th
- Candidates for posts of Assistant shroffs and UD Stenos on October 6th.
- Candidates for the posts of Junior Assistants as per merit list numbers from 1-48 should on October 7th.
- Candidates for posts of Junior Posts as per merit list number from 49-99 October 8th.
Sri Rao said of the 120 marks given for all candidates the cut-off marks FOR EACH CATEGORY OF RESERVATION WERE AS BELOW.
- 77 marks for General,
- 66 marks for General (women) –
- 73- for BC-A
- 62 for BC-A (women)
- 75 for BC-B
- 62 for BC-B (Women quota)
- 70 marks for BC-D
- 61 for BC-D (women)
- 66 marks for SC
- 63 for SC (women)-63 marks
- 63 marks for ST
- and 52 marks for ST (women quota),
District Collector Sri Sheshadri, Tirupati Urban District Superintendent of Police Mr Ravinder, TTD JEO Dr N.Yuvraj and Recruitment officer Smt Chenchu Lakhsmi were also present.
తితిదే వ్రాత పరీక్షల ఫలితాల విడుదల
తిరుపతి, 2010 అక్టోబర్ 01: తిరుమల తిరుపతి దేవస్థానములు 186 పోస్టుల భర్తీ కోసం కిందటి నెల 26వ తేదిన నిర్వహించిన పరీక్షా ఫలితాలను శుక్రవారం టిటిడి ఇఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. పరీక్షా ఫలితాలను అభ్యర్థులు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. తిరుమల.ఓఆర్‌జిలో చూడవచ్చని ఆయన తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 99 మంది, టైపిస్టు పోస్టులకు 37 మంది అసిస్టెంట్, షరాఫ్ పోస్టులకు 26 మంది, ఎల్డీ స్టెనోకు 9 మంది యూడి స్టెనోకు 15 మందిని ఎంపికచేశామని, మొత్తం 186 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేది అధారంగా సీనియార్టీని నిర్థారించామని చెప్పారు. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిచామన్నారు. ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధృవపత్రాలతో పాటు అక్టోబర్ 5వ తేదిన టైపిస్టు, ఎల్‌డిస్టెనోలు, 6వ తేదిన అసిస్టెంట్, షరాఫ్, యూడిస్టెనోలు, 7వ తేదిన జూనియర్ అసిస్టెంట్స్‌లో ప్రతిభజాబితాలో మొదటి 48 మంది అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
అలాగే 8వ తేదిన 99 మందిలో మిగిలిన 49 మంది అభ్యర్థులు హాజరుకావాలని చెప్పారు. కాగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా ఆయన తెలిపారు. 120 మార్కులకు గానూ జనరల్ 77, జనరల్ స్త్రీకోటాకు 66 మార్కులు, బిసిఎ కు 73, బిసిఎలో స్త్రీకోటాకు 62 మార్కులు, బిసిబి కి 75 మార్కులు, మహిళ కోటాకు 62, బిసిడి కి 70 మార్కులు, స్త్రీకోటాకు 61 మార్కులు, ఎస్‌సి కి 66 మార్కులు, ఎస్సీ స్త్రీకి 63 మార్కులు, ఎస్టీ కి 63 మార్కులు, స్త్రీకోటాకు 52 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శేషాద్రి, అర్బన్ ఎస్.పి. రవీందర్, టిటిడి జెఇఓ శ్రీ యువరాజ్, రిక్రూట్‌మెంట్ ప్రత్యేకాధికారి శ్రీమతి చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు అక్టోబర్ 2వ తేది శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎన్.టి. రామారావు, వరలక్ష్మి, ప్రభాకర్‌రెడ్డి, రేలంగి తదితరులు నటించిన ”సత్యహరిశ్చంద్ర” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.
కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.