EO COMMENCES POLIO DROPS ADMINISTRATION _ తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 03 March 2024: TTD EO Sri AV Dharma Reddy on Sunday morning commenced the polio drops immunization programme in front of Tirumala temple by administering polio drops to infants and children below five years of age.
TTD has set up 25 centres for the immunization program at Tirumala for the sake of both devotees and locals. The program will continue till 6pm on Sunday.
Civil Surgeons Dr B Kusuma Kumari, Dr S Kusuma Kumari, Head Nurses Smt Krishna Kumari, Smt Savitramma, and other Medical, Para Medical staff were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుమలలో పల్స్‌పోలియో లాంఛనంగా ప్రారంభించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2024 మార్చి 03: మార్చి 3వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్లు డాక్టర్ బి.కుసుమ కుమారి, డాక్టర్ ఎస్.కుసుమ కుమారి, హెడ్ నర్సులు శ్రీమతి కృష్ణ కుమారి, శ్రీమతి సావిత్రమ్మ, ఇతర వైద్య, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.