SRI KALYANA VENKATESWARA SWAMY GARUDA SEVA ON 4th MARCH _ మార్చి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

Tirupati, 03 March 2024: As part of the ongoing annual Brahmotsavam of Srinivasa Mangapuram, the special Garuda Vahana seva will be held in great splendour on the fifth day on Monday night. 

Swamy will give darshan to the devotees on His beloved Garuda Vahanam between 7pm and 9 pm.

TTD has made special arrangements in the temple for Srivari Garuda seva.

Special floral and electric lamp decorations have been completed in the temple.  Food, drinking water, milk and buttermilk will be distributed to the devotees. 

Keeping in mind the rush of devotees, strict security arrangements have been made with the coordination of vigilance and police departments to ensure smooth traffic and parking of vehicles.

SRIVARI LAKSHMI KASULA HARAM SHOBHA YATRA

Tirumala Srivari Lakshmi Haram will be taken in a procession from the TTD administration building in Tirupati at 3 pm on Monday to be decorated for the Lord in Garudaseva.

PROCESSION OF SRI ANDAL AMMAVARI MALAS:

The garland procession of Sri Andal Ammavaru starts from Tirupati Sri Govindaraja Swamy temple on Monday morning at 7 am.  A procession through the streets of the city will reach Srinivasa Mangapuram at 11 am.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

తిరుపతి, 2024 మార్చి 03: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమ‌వారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్‌ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర :

గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి సోమ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకు వెళతారు.

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు :

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి సోమ‌వారం ఉదయం 7 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.