EO FELICITATES TIRUPATI JEO_ ఘ‌నంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆత్మీయ వీడ్కోలు స‌భ

WORK IS WORSHIP-JEO

Tirupati, 29 June 2019: TTD EO Sri Anil Kumar Singhal felicitated Tirupati JEO Sri B Lakshmikantham who will be retiring on attaining the age of superannuation on Sunday.

The felicitation ceremony took place in SVETA building on Saturday evening. Speaking on this occasion, the JEO said, getting darshan of Universal Lord Venkateswara for five seconds is a difficult thing while he got an opportunity to serve in the divine abode twice for 500 days.

“With the support of EO and all the officials and employees I could able to discharge my duties to the best possible extent. I strongly believe in Work is Worship and that keeps me hale and healthy, both mentally and physically. So keep passion in work”, he added. He thanked all the officers and employees on this occasion.

All the senior officers, HoDs, employees were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఘ‌నంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆత్మీయ వీడ్కోలు స‌భ

శ్రీవారి స‌న్నిధిలో రెండుసార్లు సేవ చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 జూన్ 29: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ప‌ద‌వీ విర‌మ‌ణ సంద‌ర్భంగా ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం సాయంత్రం తిరుప‌తిలోని శ్వేత‌ భవనంలో ఆత్మీయ వీడ్కోలు స‌భ ఘనంగా జరిగింది. శ్రీ‌వారి స‌న్నిధిలో టిటిడిలో రెండుసార్లు క‌లిపి 500 రోజులు భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డాన్ని పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం అన్నారు. ముందుగా వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు శాలువతో, శ్రీవారి చిత్రపటం, ప్రసాదంతో ఘనంగా సన్మానం చేశారు.

ఆత్మీయ వీడ్కోలు అందుకున్న శ్రీ బి.ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు అకుంఠిత దీక్ష‌తో అవిర‌ళ కృషి చేయాల‌న్నారు. ప్ర‌తి సెక‌నూ స‌ద్వినియోగం చేసుకుంటే ప్ర‌తి ఒక్క‌రూ విజ‌యం సాధించ‌వ‌చ్చ‌న్నారు. తిరుప‌తిలోని విష్ణునివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాలు, ఎస్‌పిడ‌బ్యు పాలిటెక్నిక్‌, శ్రీ ప‌ద్మావ‌తి జూనియ‌ర్ క‌ళాశాల‌, ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల, కుప్పం, రాజాం, న‌ర్సాపూర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, బెంగుళూరులోని క‌ల్యాణ మండ‌పాలు, ఎస్వీ ఆయుర్వేద, బ‌ర్డ్ ఆసుప‌త్రుల‌కు క‌లిపి 12 ఐఎస్‌వో స‌ర్టిఫికేట్లు వ‌చ్చాయ‌ని, ఒకే సంస్థ‌లో ఇన్ని స‌ర్టిఫికేట్లు రావ‌డం ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేద‌న్నారు. మే 25న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో ఆగుమెంటెడ్‌ రియాలిటి టెక్నాలజిని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని, భ‌క్తుల నుండి విశేష స్పందన ల‌భించింద‌ని తెలిపారు. అదేవిధంగా, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద సెల్లార్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. తిరుపతి సుందరీకరణలో భాగంగా టిటిడి 26 కిలోమీటర్ల మేర నిర్వహిస్తున్న 9 రోడ్లలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టామ‌ని, తిరుపతిలో రాత్రివేళ విద్యుద్దీపకాంతులతో ఆకర్షణీయంగా శంఖుచక్ర నామాలు కనిపించేలా ”గోవిందమాల” పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని వివ‌రించారు.

అవిలాల చెరువు ప‌నుల‌ను వేగ‌వంతం చేశామ‌ని జెఈవో తెలిపారు. స్థానికాల‌యాల్లో ఆర్జిత‌సేవ‌ల‌కు, క‌ల్యాణ‌మండ‌పాలకు ఆన్‌లైన్ బుకింగ్ వ‌స‌తి క‌ల్పించామ‌ని చెప్పారు. టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, పెన్షనర్లకు జూన్‌ 1, 2వ తేదీల్లో తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాలలో మెగా వైద్య శిబిరం నిర్వహించామ‌ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టిటిడి ఉద్యోగులకు యోగా, ఆరోగ్య నియమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామ‌ని జెఈవో తెలియ‌జేశారు. టిటిడి ఉద్యోగుల క్వార్ట‌ర్ల వ‌ద్ద అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని, క్రీడాసముదాయం నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌ని వివ‌రించారు. ఒంటిమిట్ట‌లో అత్యంత వైభ‌వంగా రాముల వారి క‌ల్యాణం నిర్వ‌హించామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, సిఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, శ్వేత సంచాల‌కులు శ్రీ ముక్తేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఇత‌ర అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.