నందకంలో సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్లను పరిశీలించిన టిటిడి ఈఓ

నందకంలో సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్లను పరిశీలించిన టిటిడి ఈఓ

ఫిబ్రవరి 08, తిరుమల 2018: తిరుమలలోని నందకం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన రెండు సర్వదర్శనం టైంస్లాట్‌ మోడల్‌ కౌంటర్లను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం రాత్రి పరిశీలించారు. భక్తులు సులభతరంగా టోకెన్లు పొందేలా కౌంటర్లను తీర్చిదిద్దాలని సూచించారు. సర్వదర్శనం టైంస్లాట్‌ వివరాలు తెలిపేలా సూచికబోర్డులు, క్రమపద్ధతిలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఈవో ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విఎస్వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.