TTD EO RELEASES VILAMBI PANCHANGAM_ పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి ఈవో
Tirumala, 8 February 2018: TTD EO Sri Anil Kumar Singhal on Thursday evening released Vilambi Nama Samvatsara Telugu Panchangam infront of Tirumala temple.
Speaking on this occasion he said, every year TTD releases its almanac forty days before Telugu Ugadi festival.
“From today onwards, this book will be available in all the book stalls of TTD. This traditional almanac consiating Tithi, Nakshatra, Rāśi, Yoga, and Karana-Panchānga helps to plan our life in a right way and lead a healthy life”, he added.
Later TTD court astrologer Sri Tangiralaa Venkatakrishna Purnaprasad Siddhanti said this year due to Adhika Masam two brahmotsavams will be observed in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి ఈవో
తిరుపతి, 2018, ఫిబ్రవరి 09: టిటిడి రూపొందించిన శ్రీ విలంబినామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా రాబోయే శ్రీ విలంబినామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా 40 రోజుల ముందుగానే ముద్రించామన్నారు. టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటపూర్ణప్రసాద్ సిద్ధాంతి ఈ పంచాంగాన్ని రూపొందించినట్టు చెప్పారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలు చక్కగా ఉన్నాయన్నారు. రూ.50/- విలువ గల ఈ పంచాంగాన్ని ఈ రోజు నుంచి తిరుమల, తిరుపతిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. వచ్చేవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులందరూ ఈ పంచాంగాన్ని పాటించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటపూర్ణప్రసాద్ సిద్ధాంతి మాట్లాడుతూ ఈసారి జ్యేష్ఠ మాసం అధిక మాసం కావడంతో రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటపూర్ణప్రసాద్ సిద్ధాంతి, ఆగమసలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.