EO INSPECTS MADA STREETS_ శ్రీవారి ఆలయ మాడ వీధులలో టిటిడి ఈవో తనిఖీలు

Tirumala, 5 August 2017: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inspected the galleries in four mada streets to observe the ongoing arrangements for the ensuing annual brahmotsavams in Tirumala on Saturday.

Later speaking to media persons, the EO said, keeping in view the previous experiences, this year we are contemplating to ensure cent percent comfortable entry and exit to multitude of visiting pilgrims who throng the hill town for the mega religious fete. “So far we have inspected three to four times. We have enhanced our security check up this year for annual fete. Our team of officials under the supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju are making amendments to see that the devotees are not forced to any sort of inconvenience.”, he reiterated.

Earlier the JEO briefed EO with the help of maps the entry, exit and emergency gates planned in the Four mada streets through power point presentation in Gokulam Rest House Conference Hall.

SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, Annaprasadam DyEO Sri Venugopal, VGO Sri Ravindra Reddy and other officers were also present.

STEEL EMERGENCY STAIRS AS PER AGAMA ONLY-EO

While interacting with media persons in Tirumala, the EO said, the management has taken this decision only after consulting agama advisors and priests of TTD keeping the larger interests of the pilgrims in view. “We have not deviated the prescribed agama tenets while setting up this steel stairs”, he added.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయ మాడ వీధులలో టిటిడి ఈవో తనిఖీలు

తిరుమల, 2017 ఆగస్టు 05: తిరుమలలో సెప్టెంబర్‌ 23 నుండి అక్టోబర్‌ 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయ మాడ వీధులలో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శనివారం తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్వో శ్రీ ఎ.రవికృష్ణతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాలకు విశేషసంఖ్యలో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాలరీలలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగుమార్లు మాడ వీధులను పరిశీలించి భక్తులసౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని, సిసి కెమెరాల సాయంతో అన్ని ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తామని వివరించారు.

తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు కలసి అవసరమైన మార్పులు చేస్తున్నారని, తద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఈవో తెలిపారు.

అంతకుముందు గోకులం విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో జేఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నాలుగు మాడ వీధులలో జరుగుతున్న ఏర్పాట్లను ఈవోకు వివరించారు. ఇందులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర గేట్లు తదితర అంశాలను మ్యాప్‌ల ద్వారా చూపారు.

ఈవో తనిఖీల్లో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, విజీవో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆగమం ప్రకారమే ఆలయంలో అత్యవసర ఇనుప మెట్లు : ఈవో

ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆగమ సలహాదారులను సంప్రదించిన తర్వాతే శ్రీవారి ఆలయంలో అత్యవసర ఇనుప మెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.