PAVITROTSAVAMS CONCLUDES WITH PURNAHUTI_ పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
Tirumala, 5 August 2017: The celestial “Sin Free” festival, Pavitrotsavams were concluded on Saturday night with Pavitra Purnahuti.
Purnahuti was the most important fete that was observed on the last day after performing Pavitra Pratista and Pavitra Samarpana on first two days respectively.
EO Sri AK Sighal, JEO Sri KS Sreenivasa Raju were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమల, 2017 ఆగస్టు 05: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారంనాడు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
తొలి రెండురోజుల్లాగానే శనివారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9.00 గం||ల నుండి 11.00 గం||ల నడుమ ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇక రాత్రి 7.00 గం||లకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
పవిత్రోత్సవాల నేపథ్యంలో శనివారంనాడు ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.