EO INSPECTS MADA STREETS _ తిరుమలలో టిటిడి ఈవో, జెఈవో విస్తృత తనిఖీలు

Tirumala, 4 July 2017; In view of the ensuing annual brahmotsavams in Tirumala in the last week of September, TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inspected the mada streets on Tuesday evening and instructed them the arrangements to be made for the mega religious event.

The EO verified the entry gates into galleries from Asthana Mandapam, Annaprasadam Complex, Varahaswami Rest House, Medaramitta, Museum gates and instructed the vigilance and engineering wing for the necessary amendments to be carried out in these points to avoid any inconvenience to pilgrims. He also inspected the temple elephant entry gate and also the food distribution points.

Earlier the EO inspected CRO and monitored the room allotment process and also visited Sapthagiri Satralu.

Chief Engineer Sri Chandrasekhar Reddy, Temple DyEO Sri Kodanda Rama Rao, SE II Sri Ramachandra Reddy, IT Chief and GM Sri Sesha Reddy, VGO Sri Raveendra Reddy and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టిటిడి ఈవో, జెఈవో విస్తృత తనిఖీలు

తిరుమల, 2017 జూలై 04: ఈ ఏడాది సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1వ తేది వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో ఆలయ మాడ వీధులలోని గ్యాలరీలలోకి భక్తులు ప్రవేశించే మార్గాలను తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణతో కలిసి టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మంగళవారం తనిఖీ చేశారు.

ముందుగా ఆస్థానమండపం, అన్నప్రసాద భవనం, వరాహస్వామి విశ్రాంతి గృహం, మేదరమిట్ట, మ్యూజియం వద్ద గల ప్రవేశద్వారాలను పరిశీలించారు. అదేవిధంగా మాడ వీధులలో అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. గ్యాలరీల్లోకి అన్నప్రసాదాలను తీసుకెళ్లే మార్గాలను, ఏనుగులు ప్రవేశించే మార్గాన్ని తనిఖీ చేశారు. గరుడసేవ రోజు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో గ్యాలరీల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కేంద్రీయ విచారణ కార్యాలయం, సప్తగిరి సత్రాలను ఈవో తనిఖీ చేశారు. ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకుని ముందస్తుగా ఖాళీ చేసినవారికి అమలు చేస్తున్న నగదు రీఫండ్‌ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ గత బ్రహ్మూెత్సవాలలో ఎదురైన లోటుపాట్లను సవరించుకుని భక్తులకు మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేస్తామన్నారు. సెప్టెంబర్‌ 15వ తేది లోపు బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని తెలిపారు.

ఈవో వెంట టిటిడి చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఎస్‌ఈ 2, శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.