EO INSPECTS PANCHAMI THEERTHAM ARRANGEMENTS_ పంచమీ తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

Tiruchanoor, 9 Dec. 18: TTD EO Sri Anil Kumar Singhal on Sunday inspected the arrangements for Panchami Theertham which is slated for December 12 alon with JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and Tirupati Urban SP Sri Anburajan.

Briefing media he said the devotees have been thronging in huge numbers to Tiruchanoor for brahmotsavams. Yesterday nearly one lakh pilgrims had darshanam of Gaja Vahanam. Keeping in view the heavy rush for Panchami, TTD vigilance along police made elaborate security arrangements for the fete. We have also constructed 300 odd toilets and 60 food courts for devotees for the mega occasion of Panchami. We have constructed separate entry and exit points in Padmasarovaram for the hassle free holy bath of devotees”, he maintained.

Adding he said, the sevakulu will assist the TTD security, anna prasadam, health and medical wings at all crucial points and render service to pilgrims.

Meanwhile Tirupati JEO Sri P Bhaskar said, as the power of Panchami Theertha snanam lasts for the whole day, the devotees are requested to wait with patience till their turn for holy dip in waters”, he added.

CVSO Sri Gopinath Jetti, Urban SP Sri KKN Anburajan, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE Sri Ramulu, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Smt Jhansi Rani and others took part.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పంచమీ తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈవో

తిరుపతి, 2018 డిసెంబరు 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబరు 12వ తేదీన జరుగనున్న పంచమీ తీర్థం ఏర్పాట్లను ఆదివారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారీకేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌న్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్ర‌తి ఏడాది పంచ‌మి తీర్థంకు విచ్చేసే భ‌క్తుల సంఖ్య పెరుగుతుంద‌ని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.
అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు

భ‌క్తుల సౌక‌ర్య‌ర్థాం ఈ ఏడాది అద‌నంగా 60 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. తోళ్ళ‌ప్ప గార్డ‌న్స్‌లో 26, ఎస్వీ హైస్కూల్ వ‌ద్ద 18, శ్రీ అయ‌ప్ప‌స్వామి ఆల‌యం వ‌ద్ద 16 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన సిబ్బందిని, శ్రీ‌వారి సేవ‌కుల‌ను నియ‌మించిన‌ట్లు తెలియ‌జేశారు. అదేవిధంగా క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అల్పాహ‌రం, అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ చేస్తామ‌న్నారు.
మ‌రుగుదొడ్లు –

ఇందులో భాగంగా 314 శాశ్వ‌త, తాత్క‌లిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు.

సూచిక బోర్డులు –

భ‌క్తులు ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు, మ‌రుగుదొడ్లు, పార్కింగ్ ప్రాంతాల‌ను సుల‌భంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాల‌లో తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్ బాష‌ల‌లో సూచిక బొర్డులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

వైద్యం –

పంచ‌మితీర్థంలో ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా వైద్య‌, పారా మెడిక‌ల్ సిబ్బంది, 3 ప్రాంతాల‌లో ప్ర‌థ‌మ‌చికిత్స కేంద్రాలు, 4 అంబులెన్స్‌లు, అవ‌స‌ర‌మైన మందులు, స్వీమ్స్‌, రూయా ఆసుప‌త్రులకు చెందిన వైద్యులు సేవ‌లందిస్తార‌న్నారు. అదేవిధంగా ఫైర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సిబ్బంది అందుబాటులో ఉంటార‌ని తెలిపారు.

పార్కింగ్ –

పంచ‌మి తీర్థాన్నికి విచ్చేసే సామాన్య భ‌క్తులకు శిల్పారామం, త‌న‌ప‌ల్లి, మార్కెట్‌యార్డు, రామానాయుడు క‌ల్యాణ మండ‌పం, పూడి జంక్ష‌న్‌, తిరుచానూరు హ‌రిజ‌న‌వాడ వ‌ద్ద పార్కింగ్ ఏర్పాటు చేశామ‌న్నారు. వి.ఐ.పిల‌కు తిరుచానూరు పంచాయ‌తీ కార్యాల‌యం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు.

ప‌ద్మ‌పుష్క‌రిణిలో ఉదయం 11.45 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.

తిరుపతి జెఈవో మాట్లాడుతూ తిరుమ‌ల నుండి వ‌చ్చే శ్రీ‌వారి సారేను ప‌సుపు మండ‌పం నుండి ఏనుగుపై పంచ‌మి మండ‌పంకు తీసుకు వ‌చ్చేట‌ప్పుడు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. పుష్కరిణిలో స్నానం చేసి వెలుపలికి వచ్చే సమయంలో, స్నానం కోసం భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించే సమయంలో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి తోపులాటకు ఆస్కారం ఉండదన్నారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్క్‌ చేసి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన భక్తులను కోరారు.

అంతకుముందు ఈవో, తిరుపతి జెఈవో, సివిఎస్వోలు తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్‌తో క‌లిసి ప‌సుపు మండ‌పం నుండి పంచ‌మి మండ‌పం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంత‌రం తోళ్ళ‌ప్ప‌గార్డ‌న్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్ల‌ను ప‌రిశీలించారు.

ఈ కార్యక్రమంలో సి.ఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, డిఎస్‌పి శ్రీ మునిరామ‌య్య‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.