PADALU FOLLOWS KASULA HARAM_ వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు

Tiruchanoor, 9 Dec. 18: After the famed ‘Lakshmi Haram’ of Tirumala was taken out in a colourful procession from the hills to Alamelu Mangapuram for Gaja and Garuda vahana devas, ‘Srivari Padalu’ (golden sheath covering the feet of the deity) reached Tiruchanoor on Sunday in an equally grand procession.

The aim is to add grandeur to the festival akin to Tirumala, apart from creating the festive mood among the denizens. The Padalu will be decorated to God desa on Sunday evening for Garuda Vahana seva.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు వైభవంగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంతప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాల ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర ఉన్నతాధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.