EO INSPECTS PANCHAMI THIRTHAM ARRANGEMENTS_ అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

TIRUPATI, 27 NOVEMBER 2022: TTD EO Sri AV Dharma Reddy along with Tirupati District Collector Sri Venkatramana Reddy and SP Sri Parameshwar Reddy inspected on Sunday the arrangements for Pancham Theertham which is scheduled on November 28.

Later speaking with the media on the occasion he said for the first time TTD has laid German sheds for the sake of devotees with a holding capacity of 12thousands at Ayyappa Swamy temple, 7000 each at ZP High School and Pudi road, a capacity of 10 thousand in queue lines at Tiruchanoor roads and 15thousands in Padma Pushkarini. Arrangements have been made for the waiting of 50000 pilgrim devotees, he added.

He also said necessary annaprasadam, water, and beverages have been arranged at all the waiting points, and also toilets have been arranged.

Barricading, separate entry and exit gates, queue lines, and signboards have been arranged for the information of the pilgrims.

As more pilgrims are anticipated, police and TTD security have made elaborate security arrangements for the safety of the pilgrims.

The Chakra Snanam will be observed at 11:40.

As the divine power of Panchami Thirtha Snanam lasts for the entire day, the devotees shall wait patiently till their turn for the holy dip, he maintained.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE3 Sri Satyanarayana, SE Electrical Sri Venkateswarulu, EEs Sri Narasimha Murty, Sri Manoharam, DyEO Sri Lokanatham, and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుపతి 27 నవంబరు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 28వ తేదీన జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను ఆదివారం టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు వేచి ఉండేందుకు తొలిసారి షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద దాదాపు 12 వేలు, జడ్పీ హైస్కూల్లో 7 వేలు, పూడి రోడ్ లో 7 వేలు, తిరుచానూరు రోడ్లలో ఏర్పాటుచేసిన క్యూలైన్లలో 10 వేలు పుష్కరిణిలో 15 వేల మందికి కలిపి దాదాపు 50 వేల మందికి వేచి ఉండే ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులు వేచి ఉండటానికి ఏర్పాటు చేసిన షెడ్లులో అన్నప్రసాదము, కాఫీ, టీ అందిస్తామన్నారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారీకేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్ర‌తి ఏడాది పంచ‌మి తీర్థంకు విచ్చేసే భ‌క్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు వివరించారు.

ప‌ద్మ‌పుష్క‌రిణిలో ఉదయం 11.40 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.

అంతకుముందు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూల్లో, పూడి మార్గంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, క్యూ లైన్లు, బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు .

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో
శ్రీ నరసింహ కిషోర్, ఎస్ వి బిసి సి ఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సి.ఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ-3 శ్రీ సత్యనారాయణ, విద్యుత్ ఎస్ ఇ శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈలు శ్రీ మనోహర్, శ్రీ నరసింహ మూర్తి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది