GITA JAYANTI COMPETITIONS HELD _ గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు
TIRUPATI, 27 NOVEMBER 2022:In connection with Geetha Jayanti on December 4, Bhagavad Gita competitions were held for the students at Annamacharya Kala Mandira in Tirupati on Sunday.
Nearly 200 students belonging to 6th 7th 8th and 9th classes from various schools across Tirupati participated enthusiastically and showcased their skills.
Among Sixth and Seventh standard students, Kum Nagamalleswari, Bhavyasri, and Bhuvana Sri belonging to KBSSP, Venkateswara Children’s High Schools and Sri Padmavathi Girls High School stood in the top three places.
In the category of Eighth and Ninth classes, Chi Nanda Kishore of SGS School, Rajit of Little Angels, and Shravani of SP Girls High School stood in the top three places.
Those who are below 18 years, Hema Venkatramana, Mukunda, and Jeevan Srinivas while among those above 18 years category, kv Lakshmi Devi, M Gopala Krishna, and T Suneeta stood in first, second, and third places respectively.
A dozen experts acted as judges for the competition for various categories.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు
తిరుపతి, 2022 నవంబరు 27 ;గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి.
700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో రెండు కేటగిరీలలో అనగా 18 సంవత్సరాల వారు ఒక కేటగిరి, 18 సంవత్సరాల పైవారు రెండవ కేటగిరి గాను మరియు నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం లో 6, 7 తరగతి ఒక కేటగిరి గాను, 8,9 తరగతులు రెండవ కేటగిరి గాను పోటీలు నిర్వహించారు. తిరుపతి చుట్టుపక్కల వారికి ఈ పోటీలు నిర్వహించారు.
700 శ్లోకాలు క్యాటగిరి నందు 18 మంది, నాలుగవ అధ్యాయం లో 180 మంది తిరుపతిలోని అన్ని పాఠశాల నుండి పాల్గొన్నారు . పోటీల నిర్వహణలో 12 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ అధికారి శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో, ఎస్వీ ప్రాచ్య కళాశాల లెక్చరర్ శ్రీ హేమంత్ కుమార్ నిర్వహించారు.
విజేతలకు డిసెంబర్ 4న జరిగే గీతా జయంతి వేడుకలలో బహుమతి ప్రదానం చేస్తారు.
విజేతల వివరాలు
6,7 తరగతులు –
1. నాగమల్లేశ్వరి KBSSP Sank. School
2. భవ్య శ్రీ , శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్
3. భువన శ్రీ, ఎస్పీ గర్ల్స్ హై స్కూల్
8,9 తరగతులు
1. పి నందకిషోర్, ఎస్ జి ఎస్ స్కూల్ తిరుపతి
2. ఏ రజిత్, లిటిల్ ఏంజెల్స్
3. జే శ్రావణి ,ఎస్పీ గర్ల్స్ హై స్కూల్
700 శ్లోకాలు 18 సంవత్సరాల లోపు
1. పి హేమ వెంకటనారాయణ
2. కేపీ శ్రీ ముకుంద
3. జి జీవన్ శ్రీనివాస్
700 శ్లోకాలు 18 సంవత్సరాల తరువాత
1. కె.వి .లక్ష్మీదేవి
2. ఎం .గోపాలకృష్ణ
3. టి. సునీత
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.