EO INSPECTS PARAKAMANI BUILDING _ నూతన పరకామణి భవనాన్ని తనిఖీ చేసిన ఈవో
TIRUMALA, 22 SEPTEMBER 2022: TTD EO Sri AV Dharma Reddy along with CVSO Sri Narasimha Kishore inspected the Parakamani Building located opposite Annaprasadam complex in Tirumala on Wednesday evening which is set ready to be inaugurated by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on September 28.
Later the EO also inspected the renovation works that are being carried out in Sri Padmavathi Rest House main building at a cost of Rs.4cr. The new look dining hall will accommodate nearly 150 members.
CE Sri Nageswara Rao, SE 2 Sri Jagdeeshwar Reddy, EEs Sri Jaganmohan Reddy, Sri Surendranath Reddy, Sri Ravi Shankar Reddy, DyEOs Sri Venkataiah, Sri Selvam, VGO Sri Bali Reddy and other officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నూతన పరకామణి భవనాన్ని తనిఖీ చేసిన ఈవో
తిరుమల, 2022 సెప్టెంబరు 22: తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న నూతన పరకామణి భవనాన్ని టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి గురువారం సాయంత్రం సివిఎస్‌వో శ్రీ నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ భవనాన్ని సెప్టెంబరు 28న ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఆ తరువాత శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో రూ.4 కోట్లతో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఈవో పరిశీలించారు. ఇక్కడి భోజనశాలలో దాదాపు 150 మంది భోజనం చేసేలా అభివృద్ధి చేస్తున్నారు.
ఈవో వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇఇలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీ సెల్వం, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.