PROTECT AND SUSTAIN TRADITIONAL TEMPLE ART FOR FUTURE-TTD EO _ భవిష్యత్ త‌రాల కోసం సాంప్రదాయ ఆలయ శిల్పకళను సంర‌క్షించండి

LAUDS THE STUDENTS OF ARCHITECTURE FOR THEIR ARTISTIC SKILLS

 

MORE WORKSHOPS TO ENHANCE THE TALENTS OF ARCHI PUPILS

 

TIRUPATI, 22 SEPTEMBER 2022: Lauding the talents of the students of temple architecture, painting and sculpting in the TTD-run Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture in Tirupati on Thursday, the TTD EO Sri AV Dharma Reddy called on the students to enhance their skills to protect and sustain the traditional art for the future generations.

 

He was addressing the three-day workshop in SVITSA where in exponents, sthapathis in the field of Architecture from across the states of South India have graced the session to share their knowledge and impart the skills involved in various formats of temple sculpting.

 

The EO appreciated TTD JEO (H & E) Smt Sada Bhargavi for organizing a workshop, which is beneficial for the students to enhance their skills. He also directed to organize similar workshops frequently inviting the experts in the field. “In BIRRD hospital we are now inviting the stalwarts in the field of surgery who are attending to the patients and giving them best medication in their respective fields. Similarly, we should invite the renowned and experienced Sthapathis, artisans, skilled craftsmen in traditional art and make our students best in the field of temple architecture, painting and sculpting”, he reiterated.

 

Later he felicitated Sri Sesha Brahmam, Dr P Nageswara Rao, Sri Sundara Rajan and Sri Brahmacharya who delivered lectures on Techniques involved in Traditional Painting, Description of Pratima Lakshanma in various Silpa Shastras, trends in AP and TS temples and Saiva, Vaikhanasa and Shakti Agamas sculptures respectively on the second day of the ongoing three day workshop.

 

EO VISITS THE STALLS:

 

Earlier the TTD EO visited the stalls, where the stone, metal, wooden idols, various paintings of divine portraits crafted and designed by the faculty and students are being displayed. He appreciated the dot work art of Sri G Sagar, one of the faculties in the institute and also student Ms Vennela who mastered herself in the traditional Kalamkari Art.

 

CE Sri Nageswara Rao, DEO Sri Govindarajan, Principal Sri Venkat Reddy, registered participants, faculty, students were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భవిష్యత్ త‌రాల కోసం సాంప్రదాయ ఆలయ శిల్పకళను సంర‌క్షించండి

– కళా నైపుణ్యంపై విద్యార్థులకు ప్రశంస‌లు

– విద్యార్థుల కోసం మరిన్ని వర్క్‌షాప్‌లు

– టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుప‌తి, 2022 సెప్టెంబరు 22: దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు మూల‌స్తంభ‌మైన శిల్ప‌క‌ళ‌ను సంర‌క్షించి భవిష్యత్ త‌రాలకు అందించాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంప్ర‌దాయ శిల్ప శిక్ష‌ణా సంస్థలో నిర్వ‌హిస్తున్న వ‌ర్క్‌షాప్‌లో గురువారం ఈవో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయ వాస్తు, చిత్రలేఖనం, శిల్పకళా విద్యార్థులు గొప్ప ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప్ర‌శంసించారు. విద్యార్థులు మ‌రింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి శిల్ప‌క‌ళలో ప్రావీణ్యం పొందిన స్థపతులు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, ఆలయ శిల్పకళ నైపుణ్యాలను విద్యార్థుల‌కు అందించడానికి విచ్చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిన టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఈఓ అభినందించారు. ఈ రంగంలోని నిపుణులను తరచూ ఆహ్వానిస్తూ ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో రోగులకు శస్త్రచికిత్స చేసేందుకు ఆయా విభాగాల్లో నిపుణులైన ప్ర‌ముఖ‌ వైద్యుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని, ఇదేత‌ర‌హాలో ప్ర‌ముఖ స్థపతులు, కళాకారులను ఆహ్వానించి దేవాలయ నిర్మాణం, చిత్రలేఖనం, శిల్పకళలో విద్యార్థులకు మెళ‌కువ‌లు నేర్పించాల‌ని కోరారు.

అనంతరం సంప్రదాయ చిత్రలేఖనంలో మెళకువలు, వివిధ శిల్ప శాస్త్రాలలో ప్రతిమా లక్షణం వివరణ, ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆలయాల్లో శైవ, వైఖానస, శక్తి ఆగమాలలోని అంశాల‌పై ఉపన్యాసాలు చేసిన‌ శ్రీ శేషబ్రహ్మం, డాక్టర్ పి.నాగేశ్వరరావు, శ్రీ సుందర రాజన్, శ్రీ బ్రహ్మాచార్యులను ఈవో సత్కరించారు.

స్టాళ్ల‌ను సందర్శించిన ఈవో

అంతకుముందు టిటిడి ఈవో స్టాళ్ల‌ను సందర్శించారు. అక్కడ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించిన రాతి, లోహం, సుధా, చెక్క విగ్రహాలు, వివిధ చిత్రలేఖనాలను తిల‌కించారు. క‌ళాశాల అధ్యాపకుడు శ్రీ జి.సాగర్ డాట్ వర్క్ ఆర్ట్‌ను, సాంప్రదాయ కలంకారి కళలో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థి వెన్నెలను ప్రశంసించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సిఇ శ్రీ నాగేశ్వరరావు, డిఈవో శ్రీ గోవిందరాజన్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకట రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.