EO INSPECTS QUEUE LINE PLAN FOR VAIKUNTHA EKADASI_ వైకుంఠ ఏకాదశి క్యూలైన్ల ప్రణాళికను పరిశీలించిన ఈవో

Tirumala, 26 October 2017: With just a couple of months left for yet another big religious event of Vaikuntha Ekadasi, TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna inspected the queue line plan for the same in Tirumala on Thursday.

The inspection commenced in Narayanagiri Gardens opposite VQC 2 and the officers visited Medara Mitta, New Seva Sadanam near Bata Gangamma Gudi, Kalyana Vedika, Outer Ring Road.

The EO directed the officials concerned to make arrangements to see that the pilgrims are not thrown to any sort of inconvenience during the big day.

CE Sri Chandra Sekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu, DyEO Sri Kodanda Rama Rao, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi and other officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశి క్యూలైన్ల ప్రణాళికను పరిశీలించిన ఈవో

అక్టోబరు 26, తిరుమల, 2017: డిసెంబరు 29, 30వ తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా విశేషసంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం ఏర్పాటు చేయాల్సిన క్యూలైన్ల ప్రణాళికను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీఆకే రవికృష్ణతో కలిసి పరిశీలించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ఎదురుగా గల నారాయణగిరి ఉద్యానవనాల్లో ఈ మేరకు పరిశీలన చేపట్టారు. అనంతరం మేదరమిట్ట, బాట గంగమ్మ గుడి వద్ద గల నూతన సేవా సదన్‌, కల్యాణవేదిక, ఔటర్‌ రింగ్‌రోడ్‌ ప్రాంతాలను పరిశీలించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.