EO OPENS NEW COUNTER SHEDS FOR AGED AND PHYSICALLY CHALLENGED, SARVADARSHAN HALL_ సర్వదర్శనం కాంప్లెక్స్, వృద్ధులు, దివ్యాంగుల నూతన షెడ్‌ను ప్రారంభించిన టిటిడి ఈవో
TIRUMALA, 26 October 2017: As a part of providing enhanced amenities to pilgrims, various new sheds, Halls and mini KKC were opened on Thursday in Tirumala.
TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri A Ravikrishna took part in the puja programme of mini KKC in Nandakam Rest House which was constructed at a cost of Rs.51 lakhs, followed by token issue counters for senior citizens and differently able pilgrims opposite SV Museum at a cost of Rs.20lakhs, extension of waiting hall for senior citizens and differently able persons at Rs.53.50lakhs and Sarva Darshan waiting hall near VQC II.
Later speaking on this occasion, the EO told media persons following the feed back from pilgrims, the additional amenities have been created to different categories of pilgrims for their convenience. “Earlier we used to get the feed back from the pilgrims in VQC 2 to provide additional laddu token counters in compartments. We have now set up 16 laddu token issuing counters in the Sarva Darshan Hall for the convenience of the pilgrims. We are contemplating to provide slot wise darshan for Sarva Darshan pilgrims also by December”, he added.
CE Sri Chandra Sekhar Reddy, DyEOs Sri Rama Rao, Sri Venu Gopal, Sri Venkataiah, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, Health Officer Dr Sermista, GM Transport Sri Sesha Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సర్వదర్శనం కాంప్లెక్స్, వృద్ధులు, దివ్యాంగుల నూతన షెడ్‌ను ప్రారంభించిన టిటిడి ఈవో
అక్టోబరు 26, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా సర్వదర్శనం కాంప్లెక్స్, వృద్ధులు, దివ్యాంగుల కోసం నూతన షెడ్, టోకెన్ మంజూరు కౌంటర్లు, నందకం విశ్రాంతి గృహంలో మినీ కల్యాణకట్టను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, వివిధ విభాగాల్లో అదనంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా దివ్యదర్శనం కాంప్లెక్స్ తరహాలో ఆధునిక వసతులతో రూ.3.5 కోట్ల వ్యయంతో వెయ్యి మంది భక్తులకు సరిపోయేలా సర్వదర్శనం కాంప్లెక్స్ నిర్మించినట్టు వెల్లడించారు. ఈ కాంప్లెక్స్‌లో 16 లడ్డూ టోకెన్ జారీ కౌంటర్లు, లగేజి కౌంటర్లు, టి, కాఫి, పాలు తదితర వసతులను కల్పించామన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో లడ్డూ టోకెన్ జారీ కౌంటర్లు పెంచాలని ఇదివరకు పలువురు భక్తులు సూచనలు చేశారని, భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనం కాంప్లెక్స్‌లో 16 లడ్డూ టోకెన్ జారీ కౌంటర్లు ఏర్పాటుచేశామని తెలిపారు. సర్వదర్శనం భక్తులకు డిసెంబరు నుంచి స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
నందకం విశ్రాంతిగృహంలో రూ.51 లక్షలతో మినీ కల్యాణకట్టను నిర్మించినట్టు ఈవో తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం రూ.20 లక్షలతో 7 టోకెన్ మంజూరు కౌంటర్లు, రూ.53.50 లక్షలతో వేచి ఉండే షెడ్ ఏర్పాటుచేశామన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీవేణుగోపాల్, శ్రీ వెంకటయ్య, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.