EO, JEO & CVSO INSPECTS ARRANGEMENTS _ భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన తిరుమల జెఈవో

Tirupati, 24 Sep: In the wake of the bandh call given by Samikhayandhra, JAC, TTD has made elaborate arrangements to see that no inconvenience is caused to visiting pilgrims in twin pilgrim towns on Tuesday.  
 
As a part of it TTD EO Sri M.G.Gopal, TTD Tirumala JEO Sri K.S.Sreenivasa Raju and CVSO Sri GVG Ashok Kumar have personally monitored the Annaparasadam arrangements being done by TTD to the multitude of visiting pilgrims near Alipiri. 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు అన్నప్రసాద వితరణ చేసిన తిరుమల జెఈవో

తిరుమల, సెప్టెంబరు 24, 2013: సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో తిరుపతిలోని పలు ఫలహారశాలలు, భోజనశాలలను మూసివేయడంతో తిరుమలకు వచ్చే భక్తులకు భోజనం, రవాణా విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే మంగళవారం విస్తృత ఏర్పాట్లుచేసింది. రైల్వే స్టేషన్‌, అలిపిరి లింక్‌ బస్టాండ్‌లో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

అలిపిరి వద్ద కాలిబాట భక్తులతో పాటు, ఇతరులకు ఉప్మా, సాంబారు అన్నం, పెరుగన్నం, పాలు, మజ్జిగ వంటి ఆహారపదార్థాలను అందుబాటులో ఉంచి పంపిణీ చేశారు. కొందరు భక్తులకు జెఈవో స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది