EO LAUDS ANNAPRASADAM STAFF FOR SELFLESS SERVICE TO DEVOTEES

Tirumala, 12 October 2017: TTD Executive Officer, Sri Anil Kumar Singhal today lauded the fabulous service provided by the staff of Annaprasadam department in facilitating lakhs of devotees who come for darshan of Lord Venkateswara through out the year.

Speaking to media on the ocassion of the grand Ayudha puja at Tarigonda Vengamamba Anna prasadam Bhavan(TVAPB)here along with Tirumala JEO Sri KS Sreenivasa Raju the EO said during the Deepavali, it was a annual practice of TTD to perform ayudha puja for all the cooking utensils and pray that they assist in serving the devotees non-stop through out the year.

He said the SV Nitya Annaprasadam trust had received a donation of Rs.850 crore which earned an interest of Rs.60 crore PA. As against expenses of Rs.90 crore for feeding the multitude of devotees round the year with Anna Prasadams, drinking water and butter milk, the TTD contributed Rs.30 crore towards Anna prasadams etc.

He said the feed back from devotees on Anna Prasadams has been satisfactory and on the devotee suggestions many changes have been made in supply of prasadams etc in the vaikuntam queue lines. He congratulated the Tirumala JEO Sri Raju, officials, workers and the Srivari Sevakulu for making the program a grand success.

The EO and JEO also went around the kitchen, stores rooms, cold storage, locations of vegetable cutting/rice cleaning and cooking hall in the TVAPB after the ayudha puja and gave valuable advise to staff and Srivari Sevakulu on courteous approach towards devotees and cleanliness in serving prasadams. They also interacted with devotees about quality of food and also service.

Among others TTD VGO Sri Ravindra Reddy, Anna prasadam department Dy EO Sri Venugopal, Catering officer Sri GLN Shastry etc participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అన్నప్రసాద విభాగం అధికారులకు, సిబ్బందికి అభినందనలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఘనంగా ఆయుధ పూజ

అక్టోబరు 12, తిరుమల, 2017: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న అన్నప్రసాద విభాగం అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం జరిగిన ఆయుధపూజలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా, దీపావళి పర్వదినాల మధ్య అన్నప్రసాద భవనంలో ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇక్కడి వంట సామగ్రికి, వంట పాత్రలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సంవత్సరమంతా నిర్విఘ్నంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరగాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలతోపాటు, తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్టు చెప్పారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు దాదాపు రూ.850 కోట్లను భక్తులు విరాళాలుగా అందించారని తెలిపారు. అన్నప్రసాదాల తయారీకి ఏడాదికి రూ.90 కోట్లు ఖర్చు అవుతోందన్నారు. ఇందులో డిపాజిట్లపై వస్తున్న వడ్డీ రూ.60 కోట్లు కాగా, రూ.30 కోట్లను టిటిడి ఫండ్‌గా అందిస్తోందని వివరించారు.

భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించగా అన్నప్రసాద వితరణపై సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో తెలిపారు. కొందరు భక్తులు ఇచ్చిన సూచనల మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో అన్నప్రసాదాల్లో మార్పులు చేశామని, వృథా కాకుండా చర్యలు తీసుకున్నామని, చంటిపిల్లలకు ఇబ్బందులు లేకుండా పాలు అందిస్తున్నామని వివరించారు. భక్తులకు నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కృషి చేస్తున్న అధికారులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు అభినందనలు తెలియజేశారు.

అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు పరిశీలన..

ఆయుధపూజ అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను జెఈవోతో కలిసి ఈవో పరిశీలించారు. భవనమంతా కలియదిరిగి వంట సామగ్రిని, వంట పాత్రలను, కోల్డ్‌ స్టోరేజిని, బియ్యాన్ని, కూరగాయలు తరగడం, వంట తయారీ విధానాన్ని పరిశీలించారు. వంటల తయారీ సిబ్బంది, శ్రీవారి సేవకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యత తదితర విషయాలపై పలువురు భక్తులను ప్రశ్నించగా సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ రవీంద్రారెడ్డి, అన్నప్రసాద విభాగం డెప్యూటీ ఈవో శ్రీవేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.