JEO REVIEW ON REST HOUSES, PAC AT ANNAMAIAH BHAVAN_ వసతి గదుల్లో సౌకర్యాలపై జెఈవో సమీక్ష

Tirumala, 12 October 2017: Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed the facilities, arrangements and preparedness in all the rest houses and the PAC (Pilgrims Amenities Centres) at Tirumala with engineering, reception, health, FMS( Facilitation and Maintenance services) at the Annamaiah Bhavan.

He asked the devotees to provide better infrastructure to devotees during the rainy and winter seasons.

Among others SE (Elec) Sri Venkateswarlu, Health Officer Dr Shermista, Reception DyEO Sri Harindhranath, OSD Sri Lakshminarayana Yadav, EDP OSD, Sri Balaji Prasad and others particiapted.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వసతి గదుల్లో సౌకర్యాలపై జెఈవో సమీక్ష

అక్టోబరు 12, తిరుమల, 2017: తిరుమలలోని వసతి గదులు, యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇంజినీరింగ్‌, రిసెప్షన్‌, ఆరోగ్య, ఎఫ్‌ఎంఎస్‌ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుత వర్షాకాలం, రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గదుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వసతులు కల్పించాలన్నారు. సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది మరింత మెరుగ్గా పని చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖాధికారి డా||శర్మిష్ట, రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజి ప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.