ENHANCE LUGGAGE COUNTERS IN TIRUMALA DUIRNG BTUs-EO_ తిరుమలలో భక్తుల లగేజీ కౌంటర్ల పెంపుకు చర్యలు- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 19 Aug. 19: TTD EO Sri Anil Kumar Singhal directed the officials concerned to increase the number of luggage counters in Tirumala for ensuing annual brahmotsavams to avoid the woes of multitude of visiting pilgrims for the mega religious fete.

The co-ordination meeting was held in the conference hall of TTD Administrative Building in Tirupati on Monday. EO reviewed on various works which are under progress. He instructed that all the works for annual brahmotsavams should be completed within the stipulated time. He said, the officials should carry out regular inspections in Srivari Mettu and Alipiri footpath routes and solve the problems for walkers by.

The EO also directed the concerned officials to invite artistes from different states to perform before Vahana Sevas during annual brahmotsavams. Already 10 states have given their consent to take part in the festival”, EO added.

“All the engineering works in the four mada streets should be completed including the under drainage pipeline works in time. Similarly all the toilets should be inspected and get repaired if any before brahmotsavams”, he maintained.

The EO also instructed the Forest and Garden wing officials to work with co-ordination in enhancing greenery at Sri Padmavathi Rest House areas and near road dividers.

TTD Special Officer Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramachandra Reddy and other senior officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో భక్తుల లగేజీ కౌంటర్ల పెంపుకు చర్యలు- టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 ఆగస్టు 19: శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో గరుడసేవకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం లగేజీ కౌంటర్లను పెంచి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాలలో వివిధ రాష్ట్రాల కళాబృందాలను ఆహ్వానించేందుకు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే 10 రాష్ట్రాల నుండి కళాబృందాలను పంపేందుకు ఆమోదం తెల్పారని, మిగిలిన రాష్ట్రాల కళాబృందాలను పంపేందుకు అక్కడి అధికారులతో చర్చించాలని తిరుపతి జెఈవో శ్రీ పి. బసంత్‌ కుమార్‌ను కోరారు. టిటిడి ప్రచురణలను అన్నింటిని భక్తులకు అందుబాటులో ఉంచేలా ఆన్‌లైన్‌లో క్రోడికరించాలన్నారు. పాఠకుల నుండి విశేష ఆదరణ పొందిన పుస్తకాలను పున: ముద్రించాలని ఆదేశించారు.

భక్తులు కాలిమార్గాన నడిచే అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాలలో ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని, అదేవిధంగా వర్షానికి తడవకుండా, ఎండలకు ఇబ్బంది లేకుండా నిర్మించిన పైకప్పును అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని నాలుగ మాడ వీధులలో భూగర్భ పైప్‌లైన్‌ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బ్రహ్మూెత్సవాలలోపు పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. టిటిడి అటవీశాఖ, ఉద్యానవన శాఖలు సమన్వయం చేసుకుని తిరుమలలోని శ్రీపద్మావతి వసతి సముదాయాం, రోడ్ల కూడళ్లు తదితర ప్రాంతాలలో మరింత పచ్చదనం పెంచాలని ఆదేశించారు.

తిరుమలలోని మరుగుదొడ్లు, స్నానపుగదులలో అవసరమైన మరమ్మతు పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను, అదేవిధంగా తరచూ పర్యవేక్షణ చేపట్టి మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల భవనాలపై పిడుగు నివారణ పరికరాలను అమర్చాలని సూచించారు. భక్తులు ఎక్కువమంది సందర్శించేలా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దాలని ప్రత్యేకాధికారి శ్రీ ఏవీ ధర్మారెడ్డిని కోరారు. కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని చీఫ్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, సిఇ శ్రీ జి.రామచంద్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.