TTD FORESTS HOUSES RARE “WILD” GUESTS _ టిటిడి అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు
CAMERAS TRAPS RARE SPECIES IN SESHACHALA RANGES
EO CALLS FOR THE PROTECTION OF THESE ENDANGERED RARE SPECIES OF WILD BEASTS
TTD TO TAKE UP AWARENESS PROGRAMME THROUGH DISPLAY BOARDS
Tirupati, 19 Aug. 19: The lush green forests of Seshachala Ranges, which houses the world famous Hindu shrine of Sri Venkateswara Swamy at Tirumala is a dwelling places for hundreds of rare fauna, aves, fauna and other endangered species which are unique to these forests alone.
The Forest wing of TTD has recently procured camera traps and has placed them in the surrounding forest areas of Tirumala. This is taken up as a part of the protection of these endangered species living in Tirumala ranges.
Some of the rare, vulnerable and endangered species that were captured included, Four horned antelope which is popular in the vernacular language as “Konda Gorre”, Asian Palm Civet (Punugupilli), Indian wild dog(Adivi kukka/Race kukka), Grey Jungle fowl (Adivi kodi), Leopard ( chirutha), Mongoose (Mungisa), Mouse deer (Mushika Jinka), Porcupine(Mulla Pandi), Sambar (Kaniti), Sloth bear (Elugubanti).
According to TTD DFO Sri D Phani Kumar Naidu sadid the TTD forest was spread in about 2700 hectares of the 82,500 hectares of Seshachala forests where TTD took up protection of wild life along with raising plantations.
TTD has set up state of art cameras at Parveti mandapam,Srigandha vanam,Kumaradhara-pasupudhara dam road, Dharmagiri, Papavinasanam and Seshachala forest borders lines. These cameras identify the animals through long distance sensors and photographed them both during day and night.
In areas of movement of animals the TTD will put up sign and display boards to enlighten the pilgrims on walking paths of Tirumala. TTD will also set up water tanks and other protective measures in the forest belt to support the needs of wild animals.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు
ముఖ్య ప్రాంతాల్లో కెమెరాలతో గుర్తింపు
సంరక్షణకు చర్యలు
బోర్డుల ద్వారా యాత్రికులకు అవగాహన
ఆగస్టు 19, తిరుమల 2019: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు వెలిసిన శేషాచలం అడవి ప్రకృతి సోయగానికి, అరుదైన వృక్ష, జంతు, పక్షిజాతులకు నిలయం. అడవి జంతువుల గురించి యాత్రికులకు అవగాహన కల్పించడంతోపాటు వాటిని సంరక్షించేందుకు టిటిడి కెమెరాల ద్వారా గుర్తింపు చర్యలు చేపట్టింది. తద్వారా అత్యంత అరుదైన పునుగుపిల్లి, కొండ గొర్రె, మూషిక గొర్రె, అడవి కుక్క(రేచు కుక్క)తోపాటు చిరుత, ముంగిస, అడవి కోడి, ముళ్లపంది, కణితి, ఎలుగుబంటి తదితర జంతువులు ఉన్నట్టు వెలుగుచూసింది.
ఏడు కొండల్లో సుమారు 82,500 హెక్టార్ల విస్తీర్ణంలో శేషాచలం అడవి విస్తరించి ఉంది. ఇందులో టిటిడి పరిధిలో 2700 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతాల్లో అరుదైన జీవజాతులను సంరక్షించడంతోపాటు పలురకాల మొక్కలను టిటిడి పెంచుతోంది. ఇందులో భాగంగా అటవీ విభాగం ఆధ్వర్యంలో జంతువులను గుర్తించేందుకు పార్వేటిమండపం, శ్రీగంధం వనం, కుమారధార-పసుపుధార డ్యామ్ రోడ్డు, ధర్మగిరి, పాపవినాశనం, శేషాచలం అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటుచేశారు. ఏవైనా జంతువులు కెమెరాకు నిర్దిష్టమైన దూరంలో వెళితే సెన్సార్ ద్వారా వెంటనే ఫొటో తీయడం దీని ప్రత్యేకత. ఈ విధంగా టిటిడి అటవీ ప్రాంతంలో రాత్రి, పగటి వేళల్లో తీసిన పలు ఫొటోల ద్వారా జంతువుల జాడను గుర్తించారు.
ఈ జంతువుల సంచారం ఉన్న ప్రాంతాల్లో టిటిడి బోర్డులు ఏర్పాటుచేసి యాత్రికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఎలుగుబంటి, చిరుత దాడి ఘటనల నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అడవి జంతువులను కాపాడేందుకు ఆయా ప్రాంతాల్లో నీటిని అందుబాటులో ఉంచడం, గడ్డి పెంచడం తదితర చర్యలు చేపడుతున్నట్టు టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.