CASHLESS TRANSACTIONS AT TIRUMALA FOR DEVOTEES BENEFIT- TTD EO SINGHAL_ భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో న‌గ‌దుర‌హిత లావాదేవీలు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 7 Sep. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal said that to enhance transparency, swiping machines have been installed at the accommodation and darshan counters in Tirumala to enable cashless transactions by devotees.

During the review meeting with senior officials of TTD in the Administrative Building on Saturday evening the EO said from September 6 onwards the TTD has cancelled the two percent charges for swiping bank cards at Andhra bank counter on the purchase of gold and silver dollars in Tirumala.

“The cashless transactions in Tirumala have been enabled without swiping charges by banks now for the sake of pilgrims”, he observed.

He also instructed TTD Health Officer Dr. RR Reddy to replace the chemical products used for cleaning purposes at Tirumala with Eco-friendly organic sanitation products.

He wanted introduction of 3D imaging methods as part of development activities at SV Museum and directed the concerned for updating the TTD website and revamping the Govinda mobile app besides stern action by vigilance staff against fake websites if they propagate false news tarnishing the image of TTD.

The EO also urged officials to take up extensive landscaping and social forestry at Kanyakumari temple and also promote colourful flower plants on both the ghat roads of Tirumala.

Tirumala Special Officer Sri AV Dharma Reddy, Tirupati JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramachandra Reddy, SE-1 Sri Ramesh Reddy, IT Chief Sri Sesha Reddy, DFO Sri Phani Kumar Naidu, DyEO General Smt Sudha Rani and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో న‌గ‌దుర‌హిత లావాదేవీలు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుప‌తి, 2019 సెప్టెంబ‌రు 07: భక్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌లో వ‌స‌తి, ద‌ర్శ‌న టికెట్ల కేటాయింపు కౌంట‌ర్ల వ‌ద్ద స్వైపింగ్ యంత్రాల‌ను ఏర్పాటుచేసి ఎలాంటి అద‌న‌పు చార్జీలు వ‌సూలు చేయ‌కుండా న‌గ‌దు ర‌హిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తున్నామ‌ని టిటిడి కార్య‌నిర్వ‌హ‌ణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గల స‌మావేశ మందిరంలో శ‌నివారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో ఆంధ్రా బ్యాంకు కౌంట‌ర్‌లో శ్రీ‌వారి బంగారు, వెండి డాల‌ర్ల విక్ర‌యానికి సంబంధించి 2 శాతానికి పైగా ఉన్న స్వైపింగ్ ఛార్జీల‌ను సెప్టెంబ‌రు 6 నుండి ర‌ద్దు చేసిన‌ట్టు తెలిపారు. తిరుమ‌ల‌లో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు ర‌సాయ‌న ఉత్ప‌త్తుల‌కు బ‌దులు ప‌ర్యావ‌ర‌ణ స‌న్నిహిత‌(ఎకోఫ్రెండ్లీ) ఉత్ప‌త్తుల‌ను వినియోగించాల‌ని సూచించారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధి ప‌నుల్లో భాగంగా 3డి ఇమేజింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు. వెబ్‌సైట్‌లో స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసి భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దాల‌ని, గోవింద మొబైల్ యాప్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. భ‌క్తుల‌ను అయోమ‌యానికి గురిచేసే న‌కిలీ వెబ్‌సైట్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌ద్ర‌త అధికారుల‌కు సూచించారు. క‌న్యాకుమారిలోని శ్రీ‌వారి ఆల‌యంలో ప‌లు ర‌కాల మొక్క‌ల పెంప‌కం ద్వారా సుంద‌రంగా తీర్చిదిద్దార‌ని, అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్ల‌లో ఇరువైపులా రంగురంగుల పూల మొక్క‌లు పెంచాల‌ని ఆదేశించారు.

ఈ స‌మావేశంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, డెప్యూటీ ఈవో(జ‌న‌ర‌ల్‌) శ్రీ‌మ‌తి సుధారాణి, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.