PAVITROTSAVAMS IN DEVUNI KADAPA_ దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 7 Sep. 19: The three day annual pavitrotsavams in Sri Lakshmi Venkateswara Swamy temple at Devuni Kadapa will be observed from September 11-13 with Ankurarpanam on September 10.
The JEO released the posters related to the Pavitrotsavams in his chambers in TTD Administrative Building on Saturday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 సెప్టెంబరు 07: టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 11 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను శనివారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 10న సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సెప్టెంబరు 11న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 12న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 13న మహాపూర్ణాహుతి నిర్వహిస్తామని తెలిపారు. సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.