EO OPENS SHOE KEEPING COUNTERS_ తిరుమలలో పాదరక్షలు భద్రపరుచు కౌంటర్లను ప్రారంభించిన టిటిడి ఈవో

TIRUMALA, 11 APRIL 2023: TTD EO Sri AV Dharma Reddy opened two shoe-keeping counters on Tuesday evening for devotees in Tirumala at Annaprasadam Complex and Main Kalyana Katta Complex.

Later speaking to media persons he said, the purpose behind the opening of shoe counters is that there is a strong sentiment among pilgrims thronging Tirumala that they should not wear chappals around temple premises.

So to safeguard their footwear, we have contemplated shoe-keeping counters in ten areas out of which two are opened today, he added.

Briefing further he said, the devotees shall have to take the bags bearing number and place the footwear, tie it properly and place it back in the rack bearing the same number. The devotee will be issued a token with same number as that of the rack ans bag. After his or her return, the devotee gives  the token and gets back his shoes. “Here the responsibility of the devotee is more while the tokens will be issued by srivari sevaks”, EO said.

In MTVAC the shoe keeping centre with 1187 racks and at Main KKC 4000 racks was opened up for devotees. Soon the shoe keeping centres at PAC 1,2,3, Narayana Giri queues, Rambhagicha, Supadham, ATC circle, VQC will also be inaugurated.

CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Kalyana Katta and Annaprasadam Deputy EO Sri Selvam, Health Officer Dr Sridevi, VGO Sri Bali Reddy, Catering Special Officer Sri Shastry and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో పాదరక్షలు భద్రపరుచు కౌంటర్లను ప్రారంభించిన టిటిడి ఈవో

తిరుమల, 2023 ఏప్రిల్‌ 11: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్‌లలో పాదరక్షలు భద్రపరచు కౌంటర్లను మంగళవారం సాయంత్రం టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలకు విచ్చేసే భక్తుల పాదరక్షల భద్రపరచడానికి టిటిడి పలు ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

భక్తుల పాదరక్షలను భద్రపరచడానికి, టీటీడీ పది ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు రెండు కౌంటర్లు ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కౌంటర్లలో భక్తులు నంబర్ ఉన్న బ్యాగ్‌లను తీసుకొని పాదరక్షలను ఉంచి, దారంతో కట్టి, అదే నంబర్ ఉన్న రాక్‌లో తిరిగి ఉంచాలన్నారు. భక్తుడికి ర్యాక్ – బ్యాగ్‌తో సమానమైన నంబర్‌తో టోకెన్ జారీ చేయబడుతుందన్నారు. భక్తులు తిరిగి వచ్చిన తర్వాత టోకెన్ ఇచ్చి వారి పాదరక్షలను తిరిగి పొందుతారని తెలిపారు. శ్రీవారి సేవకుల ద్వారా టోకెన్లు జారీ చేయనునట్లు చెప్పారు.

కాగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు, ప్రధాన కల్యాణ కట్ట వద్ద 4 వేల ర్యాక్‌లను భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలో పిఎసి – 1,2,3, నారాయణగిరి క్యూ లైన్లు, రాంభాగీచా, సుపదం, ఏటీసీ సర్కిల్, వీక్యూసీలో పాదరక్షల భద్రపరుచు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, కల్యాణకట్ట మరియు అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, వీజీఓ శ్రీ బాలిరెడ్డి, క్యాటరింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.