EO PRESENTS SILK VASTRAM TO KANIPAKKAM TEMPLE _ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Tirupati, 30 Aug. 20: As part of a tradition, TTD EO Sri Anil Kumar Singhal has presented silk vastrams to Sri Varasiddhi Vinayaka Swamy temple at Kanipakam in Chittoor district on Sunday.
On his arrival, TTD EO was given warm welcome by local legislator Sri MS Babu and Kanipakam temple Executive Officer Sri Venkatesu.
After darshan, TTD EO was presented with prasadam of Sri Varasiddhi Vinayaka Swamy by the temple authorities.
It may be recalled that TTD has been presenting the Vastram to this temple since 2006. These Pattu Vastrams will be decorated to the deities during celestial Kalyanam which will be observed on Sunday evening.
Tirumala temple DyEO Sri Harindranath was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి, 2020 ఆగస్టు 30: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టిటిడి తరఫున ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ యం.ఎస్.బాబు ఆలయ ఈవో శ్రీ ఎ. వెంకటేశు, వేదపండితులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో, ఎమ్మెల్యే శ్రీ యం.ఎస్.బాబులు స్వామివారికి ప్రత్యేక పూజలు, నిర్వహించారు. వీరికి మూషిక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు, శేష వస్త్రాలు అందించారు.
కాణిపాకంలో ఆగస్టు 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 30వ తేదీ ఆదివారం సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం జరుగనుంది. 2006వ సంవత్సరం నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలలో కల్యాణం కోసం టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి కస్తూరి, ఏఈవోలు శ్రీ విద్యాసాగర్ రెడ్డి, శ్రీ హరిమాధవ రెడ్డి, సూపరిండెంట్ శ్రీ కోదండపాణి పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.