EO RELEASES FIVE MORE TTD PUBLICATIONS DURING HANUMANTHA VAHANAM_ హనుమంత వాహనసేవలో ఆవిష్కరించిన ఆధ్యాత్మిక గ్రంథాలు

Tirumala, 28 September 2017: The TTD Executive Officer Sri Anil Kumar Singhal today released six publications brought out by TTD at the Vahana Mantapam with Hanumantha Vahanam on the Mada Streets.

The publications were Prasanna Ramayanam (Sarala Vachanam) by Dr Rayasam Lakshmi, Sri Venkateswaraswami Avataram (English) by Sri A Krishna, Raghuvamsam (Commentary on Mahakavi Kalidasa) by Mahamopadhyaya Dr Samudrala Lakshmayya, Padya Pushpalu by Dr Samudrala Lakshmayya and Sripadarayala Pada Kavita Vaibhavam by Sri K Purushottam Rao.

Speaking on the occasion the TTD EO said that the publications aimed at spreading and propagating the concept of Sanatana Hindu Dharma and the glory of Lord Venkateswara among the masses.TTD has brought out nearly 2000 publications and many of them have been digitized and placed on the portal in the e-book format, he said.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

హనుమంత వాహనసేవలో ఆవిష్కరించిన ఆధ్యాత్మిక గ్రంథాలు

సెప్టెంబర్‌ 28, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూటత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన 6 ఆధ్యాత్మిక గ్రంథాలను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె.రవిక ష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లూరు ఆంజనేయులు, సబ్‌ ఎడిటర్‌ డా|| నొస్సం నరసింహాచార్యులు, గ్రంథ రచయితలు పాల్గొన్నారు.

ప్రసన్న రామాయణం(సరళవచనం)(1, 2 సంపుటాలు) :

ఈ రెండు సంపుటాలను డా|| రాయసం లక్ష్మి రచించారు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణాన్ని తెలుగులో సరళమైన భాషలో సులభమైన వచన రూపంలో రాశారు. ఇది రెండు సంపుటాలుగా వెలువడుతోంది. మొదటి సంపుటంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలు ఉండగా, రెండో సంపుటంలో కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఉన్నాయి.

శ్రీవేంకటేశ్వరస్వామివారి అవతారం ( ఆంగ్ల అనువాదం) :

ఈ గ్రంథాన్ని శ్రీ ఎ.కృష్ణ రచించారు. శ్రీవేంకటేశ్వరుడు వక్ష:స్థల మహాలక్ష్మితో కలిసి ఈ దివ్యక్షేత్రంలో అవతరించిన గాథను తెలియజేసే సరళగ్రంథం ఇది. ఈ పుస్తకాన్ని తెలుగులో డా|| సముద్రాల లక్ష్మణయ్య రాయగా శ్రీ ఎ.కృష్ణ ఆంగ్లంలోకి అనువదించారు.

రఘువంశం (మహాకవి కాళిదాసకృతికి భావానువాదం) :

ఈ గ్రంథాన్ని మహామహోపాధ్యాయ డా|| సముద్రాల లక్ష్మణయ్య రచించారు. సంస్కృత వాఙ్మయంలో వాల్మీకి మహర్షి తరువాత పేర్కొనదగ్గ మహాకవి కాళిదాసు. కాళిదాసు రచించిన రఘువంశం కీర్తిప్రతిష్ఠలందుకుంది. శ్రీరామచంద్రుడు రఘువంశానికి చెందిన సూర్యవంశీయుడు. కాళిదాసు రఘువంశ కావ్యం దిలీపునితో మొదలై అగ్నివర్ణుని చరిత్రతో అంతమవుతుంది. సంస్కృతంలో ఉన్న ఈ రఘువంశ కావ్యాన్ని భావానువాదంగా తెలుగు పాఠకుల కోసం రచించారు డా|| సముద్రాల లక్ష్మణయ్య.

పద్యపుష్పాలు (సంకలనం, వివరణ ):

ఈ గ్రంథాన్ని మహామహోపాధ్యాయ డా|| సముద్రాల లక్ష్మణయ్య రచించారు. శ్రావ్యంగా ఉంటూ కంఠస్తం చేయడానికి అనువైనది పద్యం. ఒక నీతికి ఒక సూక్తికి పద్యమే గుర్తుకు వస్తుంది. భారతం, భాగవతం, రామాయణాల్లోని మధురమైన పద్యాలను ఏర్చి భావాన్ని కూర్చి అందించిన గ్రంథమిది.

శ్రీపాదరాయల పదకవితా వైభవం :

ఈ గ్రంథాన్ని ఎస్వీయు విశ్రాంతాచార్యులు శ్రీ కె.సర్వోత్తమరావు రచించారు. తెలుగులో అన్నమయ్య మొదలైనవారి కీర్తనల నిర్మాణ రచనకు శ్రీపాదరాయలవారి పదాలు ప్రోత్సాహకాలని కవిపండిత పరిశోధకుల అభిప్రాయం. శ్రీపాదరాయలవారి జీవనరేఖలు, కీర్తనలలోని విశేషాలు, కవితాంశాలు, సందేశాలు, సంగీతాంశాలు మొదలైనవాటిని సరళసుందరంగా అందించారు. కేవలం కన్నడిగులే గాక సంగీతాభిమానులందరూ చదువదగ్గ గ్రంథమిది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.