IN FIVE DAYS OVER 2.26 LAKH PILGRIMS OFFERS HAIR-KKC DyEO_ కల్యాణకట్టలో భక్తులకు సత్వర సేవలు – డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య
Tirumala, 28 September, 2017: Tirumala,September 28: It was a 24 hour tonsuring activity at Tirumala on Garuda Seva day, as the hill shrine was crowded with devotees at every nook and corner.
The DyEO Kalyanakata Sri Venkataiah told reporters at the Media center on Thursday that nearly 2,26,429 devotees offered their hair as a part of their wish fulfillment in the last five days at the main kalyanakatta and nine other mini kalyanakattas .
About 1400 barbers including 250 women barbers worked almost round the clock. TTD has modernized four halls in the main kalyanakatta with better facilities and also supply of beverages.
TTD has supplied in all about 4.8 lakh blades, 520 cans of Dettol, 475 cans of Sodium Hypo chloride, 800 ks of sandalwood tablets, 548 kgs of rubber bands, 2500 face masks for barbers, 3240 kgs of hand wash material for benefit of pilgrims and barbers.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
కల్యాణకట్టలో భక్తులకు సత్వర సేవలు – డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య
తిరుమల, 28 సెప్టెంబరు 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు కల్యాణకట్టలో సత్వర సేవలు అందిస్తున్నామని కల్యాణకట్ట డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య తెలిపారు. కల్యాణకట్ట సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలోని 10 కల్యాణకట్టల్లో ప్రతి రోజూ 24 గంటలపాటు భక్తులకు తలనీలాలు తిసేందుకు 1354 మంది క్షురకులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 250 మంది మహిళ క్షురకులు ప్రత్యేకముగా మహిళలు, చిన్న పిల్లలకు తలనీలాలు తీయులకు నియమించినట్లు తెలిపారు. మిగిలినవారు తిరుమలలోని ప్రధాన కల్యాణ కట్ట మరియు 9 ఉప కల్యాకట్టల్లో సేవలందిస్తున్నట్టు తెలిపారు. దీంతో భక్తులు వేచి ఉండే సమయం చాలా తగ్గిపోయిందన్నారు.
తిరుమలలోని అన్ని కళ్యాణకట్టలో 2015 మే 1వ తేదీ నుండి ఉచితంగా భక్తులకు తలనీలాలు తీసేందుకు టిటిడి ఏర్పాట్లు చేసిందన్నారు. చిన్న పిల్లలు, వృద్దులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. తలనీలాలు సమర్పించేందుకు వచ్చి క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు అల్పాహారం అందిస్తున్నామన్నారు. భక్తులు తలనీలాలు తీసే సమయంలో అంటువ్యాదుల నివారణకు క్షురకులకు నాణ్యమైన బ్లేడులు, డెటాల్, లోషన్, మాస్క్‌లను వినియోగిస్తున్నామని వివరించారు. తలనీలాల అనంతరం భక్తులకు చందనం అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇప్పటి వరకు (5 రోజులకు) 2,26,173 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని వివరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.