EO RELEASES PUSHPAYAGAM POSTERS OF SKVST_ శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం గోడపత్రికల ఆవిష్కరణ

Tirupati, 10 March 2018: In connection with annual pushpayagam in Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram on March 14, TTD EO Sri Anil Kumar Singhal released the posters for the same religious event.

Meanwhile on March 13 there will be Ankurarpanam and Snapana Tirumanjanam to Utsavarulu on March 14 from 10:30am on wards till 12 noon. Between 2:30pm and 5pm Pushpayagam takes place in a colourful manner where in the deities are rendered floral bath with over 5 tonnes of various flowers.

Devotees who are willing to take part in this fete can pay Rs.516 on which two persons will be allowed.

Chief Engineer Sri Chandrasekhar Reddy, Temple DyEO Sri Venkatiah, DyEO Smt Malleswari Devi, CAO Sri Raviprasadu were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం గోడపత్రికల ఆవిష్కరణ

మార్చి 10, తిరుపతి, 2018: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేదీన జరుగనున్న వార్షిక పుష్పయాగం గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

మార్చి 13వ తేదీ మంగళవారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది. మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. పుష్పయాగం కారణంగా మార్చి 14వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఏఓ శ్రీ రవిప్రసాదు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, బోర్డు సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.