PULSE POLIO IN TIRUMALA_ మార్చి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమలలో పల్స్‌పోలియో

Tirumala, 10 March 2018: The Pulse Polio administration for the children below five years of age will be done at Tirumala from March 11-13.

A total of 25 centres have been set up in Tirumala to administer polio drops which commenced on Sunday at 7am and lasts up to 6pm.

According to CMO Dr D Nageswara Rao, 20 were placed at different vital points for the sake of pilgrims, four for locals and one more in Srivari temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమలలో పల్స్‌పోలియో

తిరుమల, 2018 మార్చి 10: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో మార్చి 11 నుండి 13వ తేది వరకు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.