EO REVIEWS ARRANGEMENTS FOR ENSUING SUMMER AND TUMBURU THEERTHA MUKKOTI _ వేసవి రద్దీ నేపద్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు

TIRUMALA, 05 MARCH 2024: TTD EO Sri AV Dharma Reddy held the coordination meeting with the heads and senior officers of various departments at Annamaiah Bhavan in Tirumala on Tuesday evening.

He reviewed on the arrangements to be made for the ensuing summer vacation pilgrim rush which will last till July.

As a part of it he directed the officials concerned to apply white-cool-cem paint at usual places in Tirumala, Srivari Seva Sadan, Akkagarla Gudi on First Ghat Road, once in a week during the entire summer.

He also instructed to ensure proper power supply of electricity without causing any inconvenience to the administration as well to the visiting pilgrims during the summer.

Besides directed temple officials to keep sufficient buffer stock of laddus to cater the needs of the pilgrim public during the summer season and instructed Medical officials to keep sufficient stock of ORS sachets as a preventive measure for the sake of the pilgrim public.

Tumburu Theertham

He also reviewed on the arrangements of Tumburu Theertham which is scheduled on March 25.

As the torrent festival falls in the peak summer, he instructed the concerned to ensure the health safety and security of pilgrims. “Give wide publicity that physically fit pilgrims who are aged up to 60 years alone will be allowed to trek the path. And also, pilgrims with obese, heart ailments, asthma, other chronic diseases will not be allowed in view of their health safety”, he stressed.

Meanwhile, as the torrent fete falls on March 25, the devotees will be allowed from 5am of March 24 till 3pm of the same day. And again from 5am of March 25 till 11am of the same day.

Food and water distribution will be made deploying sufficient number of Srivari Sevaks. Deployment forest, vigilance personnel for the safety of trekking devotees all through the path, keeping ready medical teams and ambulance services, other safety measures have also been discussed in detail.

The EO also reviewed on the progress of other development works in Tirumala and instructed the concerned to complete the repair works in rest houses if any on time, in view of ensuing summer rush.

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy and other HoDs, senior officers were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వేసవి రద్దీ నేపద్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు

– తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్ల‌పై ఈవో సమీక్ష

తిరుమ‌ల‌, 2024 మార్చి 05: తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌక‌ర్యాం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం జూలై వరకు కొనసాగనున్న వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈవో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మొదటి ఘాట్‌ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్‌, తిరుమలలో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చ‌లువ పెయింట్‌ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంత‌రాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు. యాత్రికుల కోసం ఒఆర్ఎస్ ప్యాకెట్ల‌లను తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. రాబోవు వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటి సరఫరాచేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

తుంబురు తీర్థం :

మార్చి 25వ తేదీన తిరుమలలో జరుగనున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుండి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు.

యాత్రికుల ఆరోగ్య, భద్రతకు సంబంధించి అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు. “60 ఏళ్లలోపు వయస్సు ఉన్న యాత్రికులు, శారీరకంగా దృఢంగా ఉన్న యాత్రికులు మాత్రమే ఈ మార్గంలో ట్రెక్కింగ్‌కు అనుమతించనున్న‌ట్లు విస్తృతంగా ప్రచారం చేయాల‌న్నారు. అలాగే, ఊబకాయం, గుండె జబ్బులు, ఉబ్బసం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న యాత్రికులు వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా అనుమతించబడరు” అని చెప్పారు.

మార్చి 24 ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్లీ మ‌రుస‌టి రోజైన‌ మార్చి 25న‌ ఉదయం 5 నుండి ఉదయం 11 గంటల వరకు మాత్ర‌మే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. తగినంత సంఖ్యలో శ్రీవారి సేవకులను నియమించి ఆహార, నీటి పంపిణీ చేయల‌న్నారు. మార్గమంతా ట్రెక్కింగ్ చేసే భక్తుల భద్రత కోసం అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బందిని నియమించడం, వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచడం, ఇతర భద్రతా చర్యలపై కూడా కూలంకషంగా చర్చించారు.

తిరుమలలో ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ఈవో సమీక్షించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి గృహాలలో మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.