SOMASKANDA MURTHY ON THE ADHIKARA NANDI VAHANAM _ అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

Tirupati, 05 March 2024: On the fifth day of the ongoing annual Brahmotsavam of Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Somaskandamurthy took a celestial ride on the Adhikara Nandi Vahanam on Tuesday night. 

Vahanaseva took place in the city streets amidst of bhajans, kolatams, Mangala Vaidyams covering Kapilatheertham Road, Anna Rao Circle, Vinayaka Nagar Quarters, Harerama Harekrishna Gudi, NGO Colony, Alipiri Bypass Road.  

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి

తిరుప‌తి, 2024, మార్చి 05: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మంగళవారం రాత్రి శ్రీసోమస్కంధమూర్తి అధికార నంది వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

 శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది. ఈ అధికారనందికి మరోపేరు కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.