EO REVIEWS ON ANNUAL BRAHMOTSAVAMS _ అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు

EKANTA BRAHMOTSAVAMS FROM OCTOBER 7 TO 15 IN TIRUMALA

 

DEVOTEES FROM WEAKER SECTIONS TO GET DARSHAN

 

TIRUMALA, 21 SEPTEMBER 2021:  As the annual brahmotsavams in Tirumala Srivari temple are scheduled from October 7 to 15, TTD EO Dr KS Jawahar Reddy held a detailed review meeting at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

 

 

During his Department-wise review on the ongoing arrangements for the mega festival, he directed the Heads of all departments to ensure that the Nine-day fete be performed with utmost religious fervour, in an attractive and unique manner.

 

 

Earlier, the Additional EO Sri AV Dharma Reddy briefed the EO that the important days includes Dhwajarohanam on October 7, Garuda Seva on October 11, Golden Chariot on October 12, Rathotsavam on October 14, Chakrasnanam and Dhwajavarohanam on October 15. The Additional EO also said, the Honourable Chief Minister of Andhra Pradesh, Sri YS Jaganmohan Reddy will be invited for the annual brahmotavams as in the case of every year.

 

 

PLAN INNOVATIVELY: EO TO HoDs:

 

 

The EO asked the Electrical and Garden wing officials to plan innovative designs of decoration for the annual event at the GNC toll gate, at the temple, traffic islands etc. He also instructed the Engineering wing to complete the Alipiri footpath works and repair works of room in SPRH area as per the scheduled date.

 

 

The EO said the devotees from weaker sections belonging to the areas where TTD has constructed 500 temples across the state shall be provided darshan not exceeding 1000 people per day during this annual brahmotsavams and instructed the Transport GM to make necessary arrangements for the same with a concrete action plan.

 

 

He also instructed the concerned to plan unique cultural events during these nine days at Nada Neerajana Mandapam.

 

During the department-wise briefing on arrangements, the CE Sri Nageswara Rao has explained the EO that the checking of all the Vahanams will be completed between September 27 and 30.

 

 

The temple DyEO Sri Ramesh Babu said, the cleaning of jewellery will be done on October 4 and 5 while the Annaprasadam wing DyEO Sri Harindranath said, the MTVAC will function between 8am and 11pm during brahmotsavams.

 

 

The Additional CVSO Sri Siva Kumar Reddy stated that all the security measures have been ensured for the big event.

 

 

The DyEOs for Reception Sri Lokanatham and Sri Bhaskar said that all rooms in their respective areas have completed mass cleaning and are kept ready for allotment during the annual fete.

 

 

The SVBC CEO Sri Suresh Kumar said all arrangements are in place for the launch of the Kannada and Hindi channels of SVBC. He said the test launch will be completed in the first week of October. PRO Dr T Ravi said, a limited number of Srivari Sevaks will be invited to render service in various departments as in the case of last year.

 

 

The other wing HoDs also briefed the EO on the arrangements by their respective wings.

 

 

Chief Priests Sri Venugopala Deekshitulu, Sir Krishna Seshachala Deekshitulu, Sri Govindarajulu Deekshitulu JEO Smt Sada Bhargavi, FACAO Sri Balaji, SE 2 Sri Jagadeeshwar Reddy, Transport GM Sri Sesha Reddy, All Projects Officer Sri Vijayasaradhi, CMO Dr Muralidhar, HO Dr Sridevi, Garden Superintendent Sri Srinivasulu, Dairy farm Director Dr Harnath Reddy, DyEOs Sri Selvam, Sri Natesh Babu, Smt Padmavathi and other officials were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు

అక్టోబ‌రు 11న గ‌రుడ సేవ‌

ప్ర‌తి జిల్లా నుండి బ‌స్సుల ద్వారా వెనుక‌బ‌డిన ప్రాంతాల భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం

ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష‌

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 21: తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింద‌ని ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌ అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈఓ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే 9 రోజుల్లో రాష్ట్రంలో టిటిడి ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన 500 నుండి 1000 మంది భ‌క్తుల‌ను బ‌స్సుల్లో ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్ డిపిపి, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వేద పారాయ‌ణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు అంద‌జేయాలని అధికారులకు సూచించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్ర‌ముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్ర‌హ్మోత్స‌వాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్త‌యిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. వాహ‌నసేవలు జ‌రిగే ప్రాంత‌మైన ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో చిన్న బ్ర‌హ్మ‌ర‌థం ఏర్పాటు చేయాల‌న్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో భ‌క్తుల‌కు, విఐపిల‌కు ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు సూచించారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని కూడ‌ళ్లు ఇత‌ర ముఖ్య‌మైన ప్రాంతాల్లో శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు, అన్న‌ప్ర‌సాదాల్లో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను ఆదేశించారు. వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ప‌రిమిత సంఖ్య‌లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. పారిశుద్ధ్యం చ‌క్క‌గా ఉండాల‌ని, క్ర‌మం తప్ప‌కుండా నీటి నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని ఆరోగ్య విభాగం అధికారుల‌కు సూచించారు.

అంతకుముందు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, అక్టోబ‌రు 6న అంకురార్ప‌ణ జ‌రుగుతాయ‌ని, బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, అక్టోబ‌రు 12న స్వ‌ర్ణ‌ర‌థం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు.

ఈ స‌మావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు, టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య‌, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ శేషారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, హెచ్‌డిపిపి ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ విజ‌య‌సార‌థి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి ఇత‌ర అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.