EO REVIEWS ON SSD COUNTERS_ ఈ నెలాఖరు లోపు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
Tirumala, 25 January 2018: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed on progress of works related to slotted sarva darshan counters (SSD) with concerned officials.
The review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Thursday evening.
TCS expert Sri Bhimsekhar explained the requirement of IT server, desktops, cubicle, QR code scanners, printers and other hardware needed for SSD counters at Tirupati and Tirumala through power point presentation.
Later the EO instructed the IT wing and civil engineering officials to complete all the works as per schedule by February end so that the counters commence in a full fledged manner from March.
SE II Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, IT chief Sri Sesha Reddy, CIO Sri Sudhakar Baskaruni, AP online representatives were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఈ నెలాఖరు లోపు సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయాలి :టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల, 2018 జనవరి 25: తిరుమల, తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌ను ఈ నెలాఖరు లోపు సిద్ధం చేసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలసి ఐటి, టిసిఎస్, ఎపి ఆన్‌లైన్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కౌంటర్లకు కావాల్సిన సాంకేతిక పరికరాల కొనుగోళ్ల టెండర్లు, ఏజెన్సీల ఎంపిక విధానం తదితర అంశాలపై సమీక్షించారు. కంప్యూటర్లు, క్యూబికల్స్, క్యూఆర్ బార్ కోడ్ స్కానర్లు, ప్రింటర్లు, వెబ్ కెమెరాలు, ఐటి సర్వర్లు తదితర పరికరాలను త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను మార్చినాటికి పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ కౌంటర్ల పనుల పురోగతిపై తిరుమల జెఈవో మూడు వారాలపాటు ప్రతి మంగళవారం సమీక్ష నిర్వహించాలని కోరారు. ముందుగా టిసిఎస్ ప్రతినిధి శ్రీ భీమ్‌శేఖర్ కౌంటర్ల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎస్‌ఈ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.