EO THANKS ALL FOR RADHASAPTHAMI SUCCESS_ రథసప్తమి సందర్భంగా సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు: టిటిడి ఈఓ, జెఈఓ
Tirumala, 24 January 2018: With the collective team work of all departments and with the support of Srivari Seva volunteers, scouts and guides, police and above all with the co-operation of pilgrims Radhasapthami has become a grand success, said TTD EO Sri Anil Kumar Singhal.
After the completion of Chandraprabha Vahanam-the last in the series of Sapta Vahana sevas on Wednesday night EO along with Tirumala JEO Sri KS Sreenivasan Raju and CVSO Sri A Ravikrishna thanked everyone for the stupendous success of the religious
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
రథసప్తమి సందర్భంగా సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు: టిటిడి ఈఓ, జెఈఓ
తిరుమల, 2018 జనవరి 24: రథసప్తమి సందర్భంగా వాహనసేవలను దర్శించేందుకు విశేషంగా విచ్చేసిన భక్తులు టిటిడికి పూర్తిగా సహకరించారని ఈఓ శ్రీ అనీల్ కుమార్ సింఘాల్, జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో బుధవారం సాయంత్రం వాహనసేవల్లో పాల్గొన్న ఈఓ మాట్లాడుతూ టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, నిఘా మరియు భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించినట్టు తెలిపారు. అన్నప్రసాదం, ఆరోగ్య విభాగాల అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు సమయానుసారం అల్పాహారం, అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు అందించినట్టు వివరించారు. జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సిబ్బంది, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ముందుగా శిక్షణ ఇవ్వడంతో భక్తులకు క్రమశిక్షణతో సేవలందించినట్టు తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా, సంతోషంగా వాహనసేవలను దర్శించుకున్నారని ఈఓ తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.