SAPTHA VAHANA SEVA CONCLUDES WITH CHANDRAPRABHA VAHANAM_ సప్తవాహనాలపై శేషశైలాధీశుడు

Tirumala, 24 January 2018: The grandeur of the seven Vahana sevas on the auspicious day of Radhasapthami concluded on a grand note with Chandraprabha Vahanam in the pleasant evening on Wednesday.

The special occasion witnessed Lord Malayappa Swamy taking celestial ride on seven vahanams starting from dawn to dusk. The bright day started with Suryaprabha vahana seva and concluded on a religious note on Chandraprabha Vahanam giving a chill-thrill to tens of thousands of devotees converged in the galleries of four mada streets.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సప్తవాహనాలపై శేషశైలాధీశుడు

విశేష సంఖ్యలో వాహనసేవలను దర్శించిన భక్తులు

జనవరి 24, తిరుమల 2018: తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు సుదర్శన చక్రత్తాళ్వారుల వారికి చక్రస్నానం స్వామి పుష్కరిణిలో వైభవంగా జరిగింది.

శ్రీ మలయప్ప స్వామివారు ఆలయాన్ని ప్రవేశించిన పిదప అర్చకస్వాములు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయ మాడవీధులలో ఊరేగిస్తూ వరాహస్వామి ఆలయాన్ని చేరుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్రత్తాళ్వారుకు పంచామ తాభిషేక స్నానం చేయించి స్వామి పుష్కరిణిలో తీర్థస్నానం చేశారు.

కల్పవ క్ష వాహనం : (సాయంత్రం 4.00 గం||ల నుండి సాయంత్రం 5.00 గం||ల వరకు) సకల కోరికలు ఈడేర్చే దైవ వ క్షం అయిన కల్పవ క్ష వాహనంపై స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో ఊరేగుతూ అనుగ్రహించారు.

సర్వభూపాల వాహనం : (సాయంత్రం 6.00 గం||ల నుండి సాయంత్రం 7.00 గం||ల వరకు) పురవీధులలో సకల చరాచర జగత్పాలకుడైన స్వామివారు రాజసం ఉట్టి పడుతుండగా, ప్రౌఢ గాంభీర్యంతో సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయహస్తాన్ని అనుగ్రహిస్తాడు.

చంద్రప్రభ వాహనం : (రాత్రి 8.00 గం||ల నుండి రాత్రి 9.00 గం||ల వరకు) భానుని లేలేత కిరణాల స్పర్శతో ప్రారంభమైన స్వామివారి సప్త వాహన శోభ వెన్నెల రేడైన చంద్రుని చల్లని కాంతులు తాకేవేళ చంద్రప్రభ వాహనసేవ ముగుస్తుంది.

ఆ తరువాత స్వామివారు దేవేరులతో కూడి బంగారు పీఠంపై ఆసీనుడై ఆలయ ప్రవేశం చేయడంతో రథసప్తమి వాహన వేడుకలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఆర్జితసేవలను టిటిడి పూర్తిగా రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు,

సివిఎస్‌వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఆలయ డిప్యూటి.ఈ.ఓ శ్రీ కోదండరామారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.