EO TREKS ALIPIRI FOOTPATH TO INSPECT GREENERY_ అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఆహ్లాదం, పచ్చదనం పెంపు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

TTD MULLS GREEN CARPET WELCOME TO ITS DEVOTEES

Tirumala, 4 July 2018: The devotees will soon experience a “Green Carpet Welcome” while trekking the Alipiri and Srivarimettu footpath routes, as TTD has mulled development of greenery on either sides of the footpaths.

TTD EO Sri Anil Kumar Singhal inspected the Alipiri footpath route by trekking down the Soapana Margam from Tirumala on Wednesday. The DFO Sri Phani Kumar Naidu explained him about the various varieties of creepers, aromatic and flowering species which are planted on either side of the footpath.

Later speaking to media persons, the EO said, in the next six months to one year, the devotees will experience an aesthetic feeling with this plantation programme. The waste water is being treated and supplied through pipes for watering the plants in footpath routes. All along Srivari Mettu footpath route also we are planning similar plantation program”, he added.

Adding further the EO said, wherever there are open spaces, be it Tirumala, Tirupati or at Vontimitta, Kurukshetra, we develop greenery. The EO complimented DFO, FROs for producing good results within three months of review meeting without seeking additional manpower.

The EO also inspected Divya Darshan token counters, Global Hospital Services in Galigopuram. Later he interacted with some pilgrims also.

Earlier, the EO inspected Tiruvenkatapatham Outer Ring Road along with CVSO In-charge Sri Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy and other officers.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఆహ్లాదం, పచ్చదనం పెంపు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూలై 04, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచేందుకు అలిపిరి నడకమార్గంలో ఇరువైపులా సువాసనలు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల పూల మొక్కలతో పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమల నుండి తిరుపతికి అలిపిరి మెట్లమార్గంలో ఈవో, సీనియర్‌ అధికారులతో కలిసి నడుస్తూ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలిపిరి నుండి జిఎన్‌సి టోల్‌గేట్‌ వరకు, రెండు ఘాట్‌రోడ్లకు ఇరువైపులా పూల మెక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఇందులో తీగజాతికి చెందిన సువాసనలు వెదజల్లే పూలమొక్కలు కూడా ఉన్నాయన్నారు.

తిరుమలలోని మరుగునీటిని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో శుద్ధిచేసి నీటిని వైపుల ద్వారా రెండు ఘాట్‌రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గలలో ఇరువైపులా ఉన్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అటవీ విభాగం సిబ్బంది సమన్వయంతో మొక్కల పెంపకం విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పెంచిన మొక్కలలో దాదాపు 60 శాతానికి పైగా మొక్కలు బాగా పెరిగాయన్నారు. అలిపిరి నడక మార్గం, ఘాట్‌రోడ్లలలో మొక్కల పెంపకం పూర్తయిన తర్వాత శ్రీవారిమెట్టు మార్గంలో పూల మెక్కలు పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో మెట్ల మార్గంలో తీగ జాతికి చెందిన క్లమాటిస్‌(గౌరికుంతల), ప్యాసిఫ్లోర, విస్‌కాలిస్‌(రాధామనోహరం), మల్లెజాతికి చెందిన నైట్‌క్వీన్‌ పూలమొక్కలను పెంచుతున్నామన్నారు. అదేవిధంగా సువాసన వెదజల్లే సంపంగి, మనోరంజితం మొక్కలు పెంచుతున్నట్లు వివరించారు.

అదేవిధంగా తిరుమలలోని వివిధ ఖాళీ ప్రదేశాలు, ఉద్యానవనాలలో ఆకర్షణీయమైన మొక్కలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరెేషన్‌ వారి సహాకారంతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించినట్లు వివరించారు. కాగా టిటిడి అనుబంధ ఆలయాలైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, ఇటీవల కుంభాభిషేకం నిర్వహించిన కురుక్షేత్రలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. తిరుమలలో డిసెంబరులోపు పూల మొక్కల పెంపకం పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు.

అంతకుముందు తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న 3 విడత రింగ్‌రోడ్డు పనులను ఈవో, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జ్‌ సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీరామచంద్రారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.